గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » 13 ఏళ్ల అబ్బాయిని ప్రేమిస్తున్న కిరణ్‌ రాథోడ్‌...!!? (Kiran Rathod| Interview| Love| Marriage| Jaipur| Mumbai)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
WD
చదివింది లెవెంత్‌స్టాండర్డ్‌ అయినా ఆ తర్వాత మోడలింగ్‌లో పలు వాణిజ్య ప్రకటనల ద్వారా హిందీ చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన నటి "కిరణ్‌ రాథోడ్‌".

హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తోన్న కిరణ్‌ రాథోడ్‌ తాను చదువుకోవడానికి సమయం సరిపోవడంలేదని చెబుతోంది. వడ్డేనవీన్‌, రాజశేఖర్‌ కాంబినేషన్‌లో 'శుభముహూర్తం' ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆమె తరుణ్‌తో 'నువ్వులేక నేనులేను' చిత్రంలో నటించింది.

కమల్‌హాసన్‌ నటించిన చిత్రం తెలుగులో 'సత్యమేవశివం'లో నటించింది. తాజాగా పేరు పెట్టని ఓ చిత్రంలో తెలుగులో నటించడానికి సిద్ధమైంది. 13 ఏళ్ళ యువకుడు ఈమెను ప్రేమించే కథతో చిత్రం రూపొందుతోంది. గురువారం ఆ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు మీకోసం..

ప్రశ్న: మీ నేపథ్యం గురించి వివరించండి?
జ : మాది జైపూర్‌. పెరిగింది ముంబైలో. నాన్నగారు అరుణ్‌ రాథోడ్‌. జైపూర్‌లో వైన్‌ షాప్స్‌ ఉన్నాయి. అమ్మేమో గృహిణి. ఇద్దరు బ్రదర్స్‌ ఉన్నారు. ఇందులో ఒకరు ఎం.బి.ఎ. చదువుతున్నాడు. మరొకరు డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో శిక్షణ పొందుతున్నారు.

ప్రశ్న: అంటే మీ ఫ్యామిలీలో మరో ఇండస్ట్రీ మనిషి ఉన్నాడన్నమాట?
జ: యస్‌.. నేను మోడలింగ్‌లోకి రావడం ద్వారా నన్నెక్కువగా ప్రోత్సహించింది కూడా సోదరుడే. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. సినిమా ప్రపంచం అనగానే చాలామంది భయపడుతుంటారు. అలాంటివేవీలేకుండా నాకు ధైర్యాన్ని నూరిపోశాడు.

ప్రశ్న: ఈరంగంలోకి ఎలాప్రవేశించారు?
జ: నేను 11వ తరగతి చదువుతండగానే.. మోడలింగ్‌ చేశాను. కొకోకోలా యాడ్‌ చేశాను. ఆ తర్వాత పలు యాడ్స్‌ చేశాను. అవి చూసి హిందీలో 'యాదె' అనే సినిమాలో నాకు అవకాశం వచ్చింది.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కిరణ్ రాథోడ్, ఇంటర్వ్యూ, నువ్వులేక నేనులేను, ప్రేమ, పెళ్లి, శుభముహూర్తం