1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
  4. Asha Saini

Mayuri| Asha Saini| Interview| Lux papa| A intlo| Item Songs | అమాయకత్వం వల్ల మోసపోయా: మయూరి

మయూరి
తనేంటో రెండునెలల్లో చెబుతానని నటి మయూరి అంటోంది. ఆదిలో "లక్స్‌పాప"గా తెరపై అందాల్ని ఆరబోసిన ఆషాషైనీ 'నరసింహనాయుడు' తర్వాత హీరోయిన్‌గా నిలబడలేకపోయింది. ఆ తర్వాత అరకొరగా ఐటంసాంగ్స్‌లోనటించింది.

తదనంతరం పాస్‌పోర్ట్‌ వివాదంలో చిక్కుకుంది. ఇవన్నీ జాతకం బాగోకనే జరుగుతున్నాయని మయూరిగా పేరు మార్చుకుంది. మొన్ననే 'ఆ ఇంట్లో' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన మయూరితో పిచ్చాపాటీ..

ప్రశ్న: 'ఆ ఇంట్లో' పాత్రకు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
జ: పూర్తిస్థాయి గృహిణిగా నటించాను. ప్రేక్షకులు చాలా బాగుందని అభినందిస్తున్నారు. ఆమెలో ఇంత టాలెంట్‌ ఉందా? అని సినిమా చూసిన వారు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చిన్నాగారి పుణ్యమే.

ప్రశ్న: ఆయన మీ పాత్రను ఏవిధంగా తీర్చిదిద్దారు?
జ: కథ చెప్పినప్పుడే ఇది దెయ్యం లాంటి పాత్ర. భిన్నకోణాలుంటాయన్నారు. చాలాసార్లు ఎమోషన్స్‌ మళ్ళీ సౌమ్యం గల షేడ్స్‌లో నటించాలి. రొటీన్‌గా చేసే పాత్రకంటే భిన్నమైంది. కొన్ని సన్నివేశాల్లో ఇంకా డెప్త్‌ ఉండాలని.. చిన్నాగారు.. "హౌ టు ఏక్టింగ్‌- బిహేవ్‌" అనే ఆంగ్ల పుస్తకాన్ని తీసుకువచ్చి నా చేత చదివించారు. తొలిసారిగా ఆయన దర్శకుడిగా చేస్తున్న ప్రయోగానికి హేట్సాప్‌ చెప్పి... కష్టపడి నటించాను.
  WD

ప్రశ్న: పేరు మార్చుకున్నతర్వాత మార్పేదైనా గమనించారా?
జ: తలరాతను ఎలాగూ మార్చలేం. కనీసం పేరుమారిస్తేనైనా దుష్ప్రభావాలు దూరమై మంచి ఫలితాలు వస్తాయని సన్నిహితులు సలహా ఇచ్చారు. అనుకున్నట్లు సానుకూల ఫలితాలొస్తున్నాయి.

ప్రశ్న: ఎలాంటి పాత్రలు చేస్తారు?
జ: ఇలా వచ్చి అలా వెళ్ళేవి కాకుండా పాత్ర గురించి కనీసం క్షణమైనా మాట్లాడుకోవాలి. ఆ ఇంట్లో పాత్రలాగా.

ప్రశ్న: మరి ఐటంసాగ్స్‌ చేయరా?
జ: అప్పుడప్పుడు తప్పదు. కానీ అచ్చం ఐటంసాంగ్స్‌ కాకుండా చిన్నపాత్రైనా పెద్దబేనర్‌, హీరోల చిత్రాల్లో నటిస్తాను.

ప్రశ్న: మీ ధ్యేయం?
జ: ప్రేక్షకులు ఎక్కువకాలం గుర్తించుకొనేట్లు చేయడం. అంత తేలిక కాదు. అలాంటి గుర్తింపు వచ్చేంత వరకూ వేచి చూడటమే.నన్ను నేను నిరూపించుకునేందుకు భారీసంస్థ మంచి ఆఫర్‌ ఇచ్చింది. ఆ వివరాలు రెండు నెలలు ఆగితే నేనే చెబుతా.

ప్రశ్న: పాస్‌పోర్ట్‌ గొడవ సమసిపోయిందా?
జ: అయిపోయిన దాని గురించి ప్రస్తావన వద్దు. అయినా నా అమాయకత్వం వల్ల మోసపోయాను. నాకు తెలీకుండా మేనేజర్లు వేరేవారి పేర్లనుకూడా నాతోపాటు తీసుకెళుతున్నట్లు చూపించారు. మొత్తానికి నేను నిర్దోషినని తేలిపోయింది.
About Writer
SELVI.M