Nagarujuna | Birthday boy | Family | Heroes | | "దారిన పోయే దానయ్య"తో చిత్రం తీయలేం: నాగ్
File
FILEసినీ పరిశ్రమకు చెందిన స్టార్లు వ్యక్తిగతంగా పలు పార్టీలపై అభిమానం చూపుతున్నప్పటికీ.. సినీ పరిశ్రమకు వచ్చే సరికి తామంతా ఒకే కుటుంబానికి చెందినవారమన్నారు. అలాగే, గతంలో జరుపుకున్న పుట్టిన రోజుల కంటే.. శుక్రవారం జరుపుకుంటున్న బర్త్‌డే చాలా టెన్షన్‌గా ఉందని ఆయన చెప్పారు. ఇందుకు కారణం.. మీకు తెలియనిదని కాదని "విక్కీదాదా" చమత్కరించారు.
1986 సంవత్సరంలో విడుదలైన "విక్రమ్" చిత్రం ద్వారా అక్కినేని నట వారసునిగా తెలుగు వెండితెర ప్రవేశం చేసిన హీరో యువసామ్రాట్ అక్కినేని నాగార్జున. నాటి నుంచి నేటి వరకు ఆయన సినీ మజిలీ "కింగ్"లాగేనే సాగుతోంది. తాను నటించే ప్రతి చిత్రంలోనూ కొత్తదనం కావాలని తాపత్రయపడే నాగ్... ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చారు.
"శివ"తో రామ్ గోపాల్ వర్మను చిత్ర పరిశ్రమకు అవకాశం కల్పిస్తే.. "మాస్"తో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్‌కు ఛాన్స్ ఇచ్చారు. ఇలా.. ఎంతో మందికి అవకాశం కల్పించిన నాగ్.. తమ కుటుంబానికి చెందిన మూడో తరం నట వారసుడిని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతలను కూడా కొత్త దర్శకుని చేతుల్లోనే పెట్టారు. గత 23 సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమలో ఉంటున్న నాగార్జున బర్త్‌డేను శనివారం తన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు...
ప్ర: ఈ పుట్టిన రోజు ప్రత్యేకత ఏమిటి?
నాగ్: నాగ చైతన్య హీరోగా పరిచయం అవుతున్న ఈ సందర్భంలో గత పుట్టిన రోజు జరిగింది. ఈ సారి అది పూర్తయి "జోష్"గా ప్రేక్షుకుల ముందుకు వస్తున్న శుభసందర్భంలో జరుపుకోవడం ఆనందంగా ఉంది. అదే సమయంలో కాస్త టెన్షన్‌గానూ ఉంది. అందరి అంచనాలు రీచ్ అయ్యేలా "జోష్" ఉంటుంది. సినిమాను ఇప్పటికే నేను చూసాను. సబ్జెక్ట్ విన్నపుడే వాసువర్మ బాగా తీయగలడని భావించాను. మా బేనర్‌లోనే పరిచయం చేలాలని తొలుత భావించాం. అయితే.. "దిల్"రాజుగారు ముందుకు వచ్చి చైతన్యతో సినిమా తీస్తానని చెప్పారు. కాదనలేక పోయాం.
మేమంతా ఒక్కటే!
వ్యక్తిగతంగా పార్టీలు వేరయినా... సినీ కుటుంబానికి వస్తే మాత్రం తామంతా ఒక్కటే. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
ప్ర: "జోష్" చిత్రం పూర్తికాక ముందే గౌతమ్ మీనన్ సినిమా కమిట్ కావడానికి కారణం?
నాగ్: వాడి చదువు పూర్తయింది. ఇక సినిమాపైనే శ్రద్ధ పెట్టాడు. సినిమాలంటే మహా ఇష్టం. నన్ను కూడా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేయమని పలుమార్లు చెప్పాడు. నాకు ఆ అవకాశం దక్కలేదు. వాడికి దక్కింది. గౌతమ్ చెప్పిన కథ బాగుంది. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతుండగా, మంజుల నిర్మాత కావడం అన్ని విధాలుగా మంచి ప్రాజెక్టు అవుతుందన్న నమ్మకం ఉంది.
ప్ర: మరి ఆ చిత్రంలో మీరు నటిస్తున్నారా?
నాగ్: ఆఁ.. ఎవరు చెప్పారు. అలాంటిదేమీ లేదు. నాకు ఛాన్స్ ఉందని అనుకోవడం లేదు.
ప్ర: శివప్రసాద్ రెడ్డి చిత్రం గురించి కాస్త చెపుతారా?
నాగ్: మంచి కథ. నాకు అత్యంత ఆప్తుడు. మళ్లీ ఆయన బ్యానర్‌లో చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. కథను ఆడియో రిలీజ్ తర్వాత లీక్ చేస్తాం.
ప్ర: మళ్లీ "అన్నమయ్య".. "శ్రీరామదాసు" వంటి చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
నాగ్: ప్రతిసారీ ఇలాంటి అవకాశాలు రావు. వస్తే మిస్ చేయను.
ప్ర: "చిరుత" ఓపెనింగ్ రోజున రామ్ చరణ్‌ను తండ్రిని మించిన తనయుడు కావాలని మీరు ఆశీర్వదించారు. అలాగే, "జోష్" ఆడియోలో బాలకృష్ణ గారు నాగ చైతన్యను దీవించారు. వీటిపై మీ కామెంట్?
File
FILEప్ర: కొత్తతరం మాటు వారసత్వ హీరోలు ఎక్కువ అవుతున్నారనే కామెంట్ ఉంది. దీనిపై మీ స్పందన?
నాగ్: ఈ విషయంలో నేను ఒప్పుకోను. మా కుటుంబాలే కాకుండా బయటివారు కూడా వస్తున్నారు. పోతున్నారు. ఏదైనా ఖర్చు చేయాలంటే పది సార్లు ఆలోచన చేయడం మనిషి నైజం. కోట్లు పెట్టి సినిమా తీసే దర్శక నిర్మాతకు ఆమాత్రం స్వేచ్ఛ ఉంటుంది. దారిన పోయే దానయ్యను పెట్టి సినిమాలు తీయలేం కదా. ఒకవేళ తీసినా.. ఎవడో కొత్తవాడట. ఏం చూస్తాం లేరా అంటూ కనీసం పోస్టర్ కూడా చూడరు. ఎంతో మంది కొత్త హీరోలు వస్తున్నారు. వారిలో సక్సెస్ శాతం ఎంత?
