1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Interview

Venkatesh| Interview| Y.S.Jagan| Y.S. Rajasekhara Reddy| Eenadu| Namo Venkatesa| Kamal Hasan | జగన్‌కు పట్టం కట్టే విషయం పార్టీ చూసుకుంటుంది: వెంకీ

నాకు రాజకీయాలంటే భయం.. నాపని నేను చేసుకుంటా..!

వెంకటేష్
WD
సినిమా అంటేనే స్టార్‌డమ్ ఉండాలి. భారీ బడ్జెట్ ఉండాలి. పాటలన్నీ విదేశాల్లో తీయాలి. హాట్..హాట్.. ఐటమ్‌ పాటతో అదరగొట్టాలి.

ఒక్క హాలీవుడ్ మినహా.. కమర్షియల్ సినిమాలన్నీ దాదాపు ఇదే సూత్రంతో అల్లుకుని వస్తున్నవే. తెలుగేకాదు.. అన్ని భాషల్లోనూ ఇదే పంథా. ప్రస్తుతం హాలీవుడ్ రూటులోనే సినిమాలు, హీరోలు పయనిస్తున్నారు.

దీనికి దశావతారం హారో కమల్‌హాసన్, తాను (వెంకటేష్) నటించే "ఈనాడు" చిత్రం ఆరంభమని వెంకీ అంటున్నారు. తెలుగు, తమిళభాషల్లో రూపొందిన ఈ చిత్రంలో నటించడం గొప్ప థ్రిల్ కల్గించిందని చెబుతోన్న వెంకటేష్ వర్తమాన, భవిష్యత్ విషయాలను ముందుంచారు. అందులో కొన్ని మీ కోసం..

ప్రశ్న: "ఈనాడు" చిత్రమెలా ఉంటుంది?
జ.. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో నటించడం నాకే కొత్తగా ఉంది. మరోసారి సినీ ప్రయాణం ప్రారంభించిన అనుభూతి కలిగింది. ఈనాడుతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త శకం ఆరంభం కాబోతోంది. రేపటికి నాంది పలకబోతున్నాం. కమర్షియల్ ఫ్లాట్‌ఫాంలో ఉంటేనే ప్రయోగంగా ఉంటుంది. ప్రేక్షకులు కరెక్ట్‌గా రిసీవ్ చేసుకుంటే అగ్రనటులంతా క్యారెక్టర్ పాత్రలు చేస్తారు.

ప్రశ్న: ఈ పాత్ర చేయడానికి కారణం?
జ.. హాలీవుడ్ చిత్రాల్లో మల్టీస్టారర్ ఉంటారు. అవన్నీ చాలా బాగుంటాయని చూసి ఎంజాయ్ చేస్తాం. ఆ తరహాలో సాగే చిత్రం కనుక నటించడానికి ఒప్పుకున్నారు. తెలుగు, తమిళభాషల్లో పోలీస్ ఆఫీసర్‌గా నేనే నటించాను. "వెడ్నెస్‌డే"లో అనుపమ్‌ఖేర్ చేసిన పాత్ర నాది.

ప్రశ్న: కమల్‌తో "మర్మయోగి"లో నటించకపోవడానికి కారణం?
జ.. అన్నీ సవ్యంగా ఉంటేనే మర్మయోగి చేయాల్సింది. ఆ టైమ్‌లో కార్పొరేట్ సంస్థలు చిత్ర నిర్మాణంలో ముందుకు వచ్చాయి. కానీ తర్వాత ఎందుకనో వెనుకడుగువేశాయి. ఆ కోవలో మర్మయోగికి రావాల్సిన ఫండ్స్ రాలేదు. దాంతో ఆ సినిమా ఆగిపోయింది, అందులో కమల్‌తో పాటు ధీటుగా సాగే పాత్ర. మళ్ళీ ఆయనే వీలుచూసుకుని ఆ చిత్రాన్ని చేస్తారు.

ప్రశ్న: ఈనాడులో చిన్న పాత్రకదా.? పూర్తిస్థాయిలో కమల్‌తో నటించే ఆలోచన ఉందా.?
జ.. ఉంది. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. దానికి కథ సిద్ధమవుతోంది. ఇదికూడా రెండు భాషల్లో ఉంటుంది.

ప్రశ్న: మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తే లాభమా? నష్టమా?
జ.. రెండూ ఉన్నాయి. పాజిటివ్ పాయింట్‍గా చూస్తే.. ప్రేక్షకులకు భారీ తారాగణం చూశామన్న కిక్ ఉంటుంది. మైనస్ విషయానికొస్తే.. వారి అంచనాలు ఎక్కువయితే కష్టమే.. దాంతో ఆడకపోతే బ్యాడ్‌నేమ్ వస్తుంది.

ప్రశ్న: "నమో వెంకటేశ" ఎంతవరకు వచ్చింది?
జ.. మొదటి షెడ్యూల్ పూర్తయింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో రూపొందుతోంది. శ్రీనువైట్ల బాగా ట్రీట్ చేస్తున్నాడు.

ప్రశ్న: అందరి వారసుల తరహాలో మీ వారసుడు అర్జున్ ఎప్పుడు తెరపైకి వస్తున్నాడు?
జ.. ఇంకా వాడికి చాలా సమయం ఉంది. నేను ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడే వాడు నా ముందుకు వస్తాడు. ఇప్పుడు అర్జున్ 1వ తరగతి చదువుతున్నాడు. అయినా అన్ని విషయాలను ఎనలైజ్ చేసేస్తాడు. ఆ హీరో అలా చేస్తున్నాడు. ఈ హీరో ఇలా చేస్తున్నాడని క్రిటిటైజ్ చేస్తుంటాడు.

ప్రశ్న: మరి మీ గురించి ఏం చెప్పాడు?
జ.. (నవ్వుతూ..) నా గురించి ఏమైనా ఉంటే మొహంమీదే చెప్పేస్తాడు.

ప్రశ్న: మీ ఇద్దరు కలిసి నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి?
జ. ఏవేవో వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో పెద్దగా నిజంలేదు. కథ కుదరాలి కదా..

ప్రశ్న: జోష్ సినిమా చూశారా?
జ: చూశాను. నాగచైతన్య బాగా చేశాడు. మొదటి ప్రయత్నం..

ప్రశ్న: నటునిగా మీ ఎనాలసిస్?
జ.. సిన్సియర్‌గా ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతాడు

ప్రశ్న: మీరు నాగచైతన్యకు సలహాలు ఇస్తుంటారా?
జ.. ఇస్తుంటాను. కానీ నా దగ్గరికి రావాలంటే చైతు.. కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే..? పిల్లాడుకదా..? భయపడుతుంటాడు.

ప్రశ్న: రాష్ట్ర పరిస్థితులపై మీకేమనిపిస్తోంది?
జ: వై.ఎస్. రాజశేఖర రెడ్డి దుర్మరణం.. ఊహించనిది.. ఎటువంటి మనిషైనా స్పిరిచువల్‌గా ఎదగాలి. అప్పుడే మైండ్ స్ట్రాంగా ఉంటుంది. ఈ మధ్య మీడియా కూడా ఎక్కువైపోయి వారి ఆలోచనల్ని రుద్దడంతో ప్రజల్లో కూడా రకరకాలైన ఆలోచనలు వెలుగెత్తి.. వారి ధైర్యాన్ని నీరుగారుస్తున్నారు.

ప్రశ్న: జగన్‌కే ముఖ్యమంత్రి పట్టం కట్టే అంశంపై మీ అభిప్రాయం?
జ.. ఈ విషయంలో జవాబిచ్చేందుకు నేనెవర్ని. నాకు రాజకీయాలంటే భయం. అదంతా పార్టీ వ్యవహారం. వారికెలాగో హైకమాండ్ ఉంది. ఆ పని వారు చూసుకుంటారు. మనపనేంటి..? నటించడం. అది నేను చూసుకుంటానంటూ.. ఇంటర్వ్యూను ముగించారు.
About Writer
SELVI.M