1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Rajamouli

Magadheera| Rajamouli| Interview| Sequel| Student n0.1| Hollywood| RoBo| Rajani Kanth| Graphics | "మగధీర"కు సీక్వెల్ తీసే ప్రసక్తే లేదు: రాజమౌళి

రజినీతో మిగతా హీరోలను బేస్ చేసుకుంటే.. అంతే సంగతులు..!

మగధీర
WD
"స్టూడెంట్ నెం.1" నుంచి నేటి "మగధీర" వరకు పట్టుమని ఆరుచిత్రాలే అయినా బాగాపేరు తెచ్చింది "మగధీర".

ఈ చిత్రంలో రాజమౌళి తెలుగు చలనచిత్రరంగం స్టామినాను హాలీవుడ్ స్థాయికి చేరేలా చేశారు. ఈ సినిమాలో పలు విజువల్స్ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో చేయడం జరిగింది.

ఆ వివరాలను రాజమౌళి ఇంటర్వ్యూ ద్వారా తెలియజేస్తూ..

ప్రశ్న: మగధీర స్క్రిప్ట్ రాసుకున్నాక గ్రాఫిక్స్ విజువల్స్ చేయాలని అనుకున్నారు?
జ: దేనికైనా ముందు కథను సమకూర్చుకోవాలి. దానికి అనుగుణంగానే ముందుగా పేపర్ వర్క్ చేసి కొంత గ్రాఫిక్స్ డిజైన్ చేసుకోవాలి. దాన్ని తెరపైకి తీసుకువస్తే ఎలా ఉంటుందనేది విజువలైజ్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ సిబ్బందిని కలిస్తే మరింతగా రాణిస్తుంది. అదే నేనూ మగధీరలో చేశాను.

ప్రశ్న: "మగధీర-2" చేయబోతున్నారా?
జ: అటువంటిది లేదు. కొన్ని కథలకు ముగింపు ఉంటుంది. మరికొన్ని కథలకు ముగింపు ప్రేరణగా ఉంటుంది. మగధీరకు ముగింపు ఉంది. ఆ కథను అలాగే తీయాలి. మళ్ళీ సీక్వెల్ తీయకూడదు.

ప్రశ్న: హాలీవుడ్‌స్థాయి చేరాలంటే ఇంకా మనం ఏం చేయాల్సిఉంటుంది?
జ: ముందుగా బడ్జెట్ అనేది కీలకం. హాలీవుడ్ చిత్రాలకు బడ్జెట్ మిలియన్ డాలర్లు వెచ్చిస్తారు. ఎన్నో దేశాల్లో ఆడుతుంది. మన దగ్గర అది చాలా పరిమితం. దాంతో ఆ బడ్జెట్‌కు అనుగుణంగా చేయాలంటే నిర్మాతలు ముందుకురారు. చేసినా గిట్టుబాటు అవుతుందా? లేదా? అనేది చూస్తారు.

ప్రశ్న: మగధీరలో ఎంతమేరకు గ్రాఫిక్స్ ఉపయోగించారు?
జ: ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో నాలుగు రీళ్ళు కీలకం. వాటికే చాలా ఖర్చయింది. మిగతాదంతా సాదాసీదా సినిమా. అదే పౌరాణికాల్లో అయితే మొత్తంగా ఎఫెక్ట్స్ చూపించాలి.

ప్రశ్న: మరి శంకర్ "రోబో" చిత్రానికి 100 వెచ్చిస్తున్నారుగా? మనమెందుకు తీయకూడదు?
జ: రజనీకాంత్ బడ్జెట్ వేరు. ఆయన చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఆడతాయి. ఆ దృష్టిలో మిగతా హీరోలను బేస్‌చేస్తే అంతే సంగతులు.

ప్రశ్న: 50 రోజుల సందర్భంగా మగధీరలో ఏదైనా కొత్తగా జతచేస్తారా?
జ: అవును. మగధీర 50 రోజుల సందర్భంగా హీరో వాటర్‌లో పడే సన్నివేశంలో కొన్నింటిని జతచేస్తున్నాం. అవి చాలా ఎఫెక్ట్‌గా ఉంటాయి. అంతకుముందు శ్రీహరి ఎపిసోడ్‌ను జతచేశాం. దానికి మంచి స్పందన వచ్చింది.

ప్రశ్న: మళ్ళీ ఇటువంచి చిత్రాన్ని తీసే ఆలోచన ఉందా?
జ: ప్రస్తుతానికి లేదు. ఇంకా మగధీర హ్యాంగోవర్‌నుంచి కోలుకోలేదు. ఇటువంటి చిత్రాలను ఎప్పుడుపడితే అప్పుడు తీయలేం. అంటూ ఇంటర్వ్యూను ముగించారు.
About Writer
SELVI.M