గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » "గాంధీ" అంటే ఇందిరమ్మ ఇంటిపేరు కాదు: కృష్ణవంశీ (Krishna Vamsi| Interview| Mahatma| SriKanth| Gandhi| Indira Gandhi| Bhavana)
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
Krishnavamsi
WD
దర్శకుడిగా తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుని "గులాబి"తో గుర్తింపు పొందిన దర్శకుడు కృష్ణవంశీ. రమ్యకృష్ణను భాగస్వామిగా చేసుకుని సినిమావారికి ఆదర్శంగా నిలిచిన వంశీ.. ఆయన భార్యతో కలిసి కథాచర్చల్లో పాల్గొంటారు.

తాజాగా ఆయన దర్శకత్వం వహించిన "మహాత్మా" చిత్రం కూడా అటువంటిదే. ముందుగా లేడీస్‌కు నచ్చితేచాలు అది చాలామందికి చేరుతుందని గ్రహించి ఈ చిత్రకథను అటు శ్రీకాంత్ ఫ్యామిలీకి, తన కుటుంబానికి చెప్పి ముందడుగు వేశారు.

శ్రీకాంత్‌కు ప్రతిష్టాత్మకంగా "మహాత్మా"వందో చిత్రం కావడం విశేషం. శ్రీకాంత్, భావన హీరోహీరోయిన్లుగా నటించిన "మహాత్మా"
సినిమా ఈ నెల 9న విడుదలకానుంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ పలువిషయాలను తెలియజేశారు.

ప్రశ్న: "మహాత్మా" అనే పేరుతో తీసిన సినిమా గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
జ: నేను చేసే ప్రతి సినిమాకు ముందుగా కొంత పరిశోధన చేయడం అలవాటు. మహాత్మాగాంధీకి సంబంధించిన సినిమా అనగానే మరింత ఎక్కువగా పుస్తకాలను అధ్యయనం చేశాను.

ప్రశ్న: మరి పుస్తకాల్లో మహాత్మా గురించి ఒక కోణం మాత్రమే ఉంటుంది. లోతుగా పోతే ఆయనది మరో కోణం. అంటే ప్రాంతీయంగా పోరాడే నాయకుల్ని నీరుగార్చేవారని కొన్ని పుస్తకాల్లో ఉంది. మరి ఈ కోణాన్ని ఎలా చూపిస్తున్నారు?
జ: కరెక్టే.. ఇంతవరకు ఎవ్వరూ అడగని ప్రశ్న అడిగారు. మీరు చెప్పినట్లు.. కొన్ని గ్రంథాల్లో జాతీయ ఉద్యమంలో కొంతమంది నాయకుల్ని నీరుగార్చిన ఘటనలు ఉన్నాయి. కానీ అదంతా స్వాతంత్ర్య పోరాట ఘట్టాల్లోనివి. కానీ నేను ఆయనలోని మానవీయ కోణాన్ని తీసుకుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా యూత్‌కు సందేశాత్మకంగా చిత్రాన్ని తీశాను.

ప్రశ్న: అంటే.. ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు?
జ: తొలి చిత్రం "గులాబి" నుంచి ప్రతి చిత్రంలోనూ ఏదో మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. మహాత్మా విషయానికొస్తే.. కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో మనజాతి మగ్గింది. దాన్నుంచి మనకు విముక్తి ప్రసాదించిన మహానుభావుడు గాంధీజీ. అహింస అనే ఆయుధం ద్వారా స్వాతంత్య్ర్యాన్ని ఎలా సాధించాడు. హింసకు ప్రతిహింస సమాధానం కాదు. ప్రేమతో దేనినైనా సాధించాలన్న గాంధీ సూత్రాన్ని ఇందులో ఆవిష్కరించాం.
Krishnavamsi, Srikanth
WD


ప్రశ్న: మహాత్మాగాంధీ అంటే అందరికీ తెలుసుకదా? ప్రత్యేకంగా ఎందుకు చూపించాలనుకుంటున్నారు?
జ: కరెక్ట్‌గా అడిగారు. మనం చదివే రోజుల్లో మహాత్మా అంటే గాంధీ అని, ఆయన పుట్టిపెరిగింది ఫలానా చోట అని తెలుసు. ఆయన తల్లిదండ్రులు, రైళ్లోనుంచి గెంటివేయబడటం వగైరా విషయాలు తెలిసినవే. ఇది గత చరిత్రగా మిగిలిపోకూడదు. నేటి యువత పాశ్చాత్య పోకడలతో పబ్ కల్చర్స్‌తో కొట్టుమిట్టాడుతోంది.

ఈ మధ్య సర్వేచేస్తే.. మహాత్మాగాంధీ అంటే ఎవరు? అని అడిగితే.. చాలామంది ఇందిరాగాంధీ వంశీయులని జవాబిచ్చారు. అంటే..? నేటి యువతకు మన గతమేమిటో..? తెలియదు. కేవలం వర్తమానం వైపే ఆలోచిస్తున్నారు. గతంలేనిదే వర్తమానం లేదు. వర్తమానం లేనిదే భవిష్యత్ లేదు. అందుకే నేను ఇటువంటి సినిమా తీయాలని ముందుకు వచ్చాను. ఆంగ్లేయులు గాంధీపై సినిమా తీసినా.. మహాత్మా.. సినిమా జాతిపిత మరో కోణం.

ప్రశ్న: అంటే.. శ్రీకాంత్‌ను మహాత్మగా చూపిస్తున్నారా?
జ: ఓ వీధి రౌడీ.. అందర్నీ భయపెట్టి.. ఏడిపించేవాడు.. అకస్మాత్తుగా మహాత్మాగాంధీలా శాంతిమూర్తి ఎలా అయ్యాడన్నదే పాయింట్. ఈ పాత్రకు శ్రీకాంత్ సరిపోయాడు.

ప్రశ్న: సెన్సార్‌పరంగాపలు కట్స్ పడ్డాయని తెలిసింది?
జ: "ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ.." అంటే అన్న పాటలోని ఇందిరమ్మ అనే పదాన్ని తొలగించారు. దానికి బదులుగా కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ అని మార్చాం. ఇలా చిన్నపాటి కటింగ్స్ ఉన్నాయి.

ప్రశ్న: మొత్తంగా చూస్తే మీ చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్ ఎక్కువుంటుందనే విమర్శ ఉంది? దీనిపై మీ సమాధానం?
జ: శృంగారం లేని జీవితం ఉండదు. సినిమాలో కూడా ఒక జీవితం ఉంటుంది. అందులో భాగంగానే శృంగారాన్ని చూపిస్తాను. దాన్ని బూతు అనుకోవడం తప్పిదమే.. అంటూ ముగించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కృష్ణవంశీ, ఇంటర్వ్యూ, మహాత్మా, శ్రీకాంత్, రమ్యకృష్ణ, గులాబి, గాంధీ, ఇందిరాగాంధీ