Actor Venkatesh | Namo Venkatesa | Cinema | Tollywood | పాజిటివ్‌గా ఆలోచించండి: వెంకటేష్
WD
సంక్రాంతి మీ సినిమా రిలీజ్ ఎలా ఉంటుదనుకుంటున్నారు..?
సంక్రాంతి మనకే కాదు. ప్రేక్షకులకు పండుగే. చాలామంది మంచి సినిమాలు వస్తాయని కోరుకుంటారు. ఆ క్రమంలోనే ఉంటుంది నమో వెంకటేశ. ఇది గుడ్ క్లీన్ మూవీ. అందరూ కలిసి చూసేట్లుగా ఉంటుంది.
బి పాజిటివ్ అనే కాప్షన్‌కు అర్థం...?
ఏముంది. అంతా పాజిటివ్‌గా ఆలోచిస్తే మనిషిలో దాగి ఉన్న శక్తి పైకి వస్తుంది. నెగెటివ్‌గా ఆలోచించి చాలామంది యువత నేడు తమ శక్తిని వృధా చేసుకుంటున్నారు. యువతే కాదు ప్రతి వ్యక్తి జీవితంలో పాజిటివ్ ఆలోచన అలవర్చుకోవాలి. అలా ప్రతిదీ పాజిటివ్‌గా ఆలోచించే వెంకటరమణ కథే ఈ చిత్రం. తనకు పెళ్లి కాకపోయినా ఇంకా టైమ్ వస్తుందని వేచి చూస్తుంటాడు.
బ్రహ్మానందం పాత్ర ఎలా ఉంటుంది...?
పెళ్లికోసం ఎదురుచూస్తున్న వెంకటరమణకు బ్రహ్మానందం పరిచయమవుతాడు. అతనికి ఓ గోల్ ఉంటుంది. ఇద్దరివీ విరుద్ధమైనవే. కానీ చేసే పనులు కడుపుబ్బ నవ్విస్తాయి.
నమో వెంకటేశ అనేది భక్తులు పవిత్రంగా పిలిచే పేరు. దాన్ని టైటిల్‌గా పెట్టి హాస్యం చేస్తున్నారా...?
అదేమీ లేదు. నమో వెంకటేశ అనేది పవిత్రమైనదే. అంతా హాయిగా నవ్వుతూ ఉండాలని చెప్పే ఉద్దేశమే. ఈ టైటిల్ వల్ల దేవుడిని కించపరిచేది ఏమీ లేదు. భక్తిని భక్తిగా చూపించాం. హీరో శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతిదానికి నమో వెంకటేశ అంటుంటాడు.
ఊళ్లల్లో నమో వెంకటేశ అనే పాటను ఇప్పటికీ రాగయుక్తంగా ఆలపిస్తుంటారు. మీ సినిమాలో వెస్ట్రన్‌గా చూపించారు. విమర్శలు రావా...?
వెస్ట్రన్ పేరుతో పేరును కించపరచలేదు. ఒకే ఒక్కసారి నమో వెంకటేశ అని వస్తుంది. దాన్ని వెరైటీగా దేవీశ్రీప్రసాద్ పాడారు. మీరన్నట్లు పాత పాటను మొత్తంగా మార్చలేదు. అసలు దాన్ని టచ్ చేయలేదు. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
త్రిషతో మళ్లీ చేయడం ఎలా అనిపిస్తోంది....?
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే... మంచి కాంబినేషన్ అని పేరు వచ్చింది. మళ్లీ అదే కాంబినేషన్ ఉంటే బాగుంటుందని ఎంపిక చేశాం. ఆమె చక్కగా నటించింది. కథకు ఆమె పాత్ర చాలా హెల్ప్ అవుతుంది.
కొత్త చిత్రాలు...?
సంక్రాంతి రిలీజ్ తర్వాత కొద్దికాలం విశ్రాంతికోసం విదేశాలకు వెళతాను. ఆ తర్వాత ఏ సినిమా అనేది ఆలోచిస్తాను.
