Actress Manjari | Subhapradam | K.Viswanath | హీరోయిన్ అన్నాక గ్లామర్ పాత్రలు చేయాలి: మంజరి
FILE
థియేటర్‌లో కూర్చుని ప్రేక్షకుల మధ్యలో సినిమా చూస్తుంటే ఎలా ఉంది...?
చాలా థ్రిల్‌గా ఫీలవుతున్నాను. ముఖ్యంగా నేను చేసిన డాన్స్‌కు ఇంటర్వెల్‌లో అంతా మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. స్వంత ఊరిలో ఉన్నంత అనుభూతి కలిగింది. తెలుగువారు ఇంత అభిమానాన్ని కురిపిస్తుంటే ఆశ్చర్యమేసింది. వారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియలేదు.
ద్విపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది...?
నటించిన రెండో చిత్రంలోనే డ్యూయల్ రోల్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కథంతా నాపైనే నడుస్తుంది. మొదటి భాగం నరెష్ భార్యగా, రెండవ భాగంలో శరత్ బాబు మనవరాలిగా నటించాను. ఇటువంటి అవకాశం మళ్లీ వస్తుందనుకోలేను.
గ్లామర్ ఆరబోత లేకుండా నటించారు...?
అవును. విశ్వనాథ్ చిత్రంలో చేయడమే గొప్ప అదృష్టం. మామూలు చిత్రాల్లో గ్లామర్ లేకుండా పాత్రలే ఉండవు. ఈ చిత్రంలో నా నడవడిక ఎలా ఉండాలి. భావప్రకటన ఎలా ఉండాలి. అన్నీ తగు జాగ్రత్తలు తీసుకుని విశ్వనాథ్ గారు చేయించారు. నాకు మంచి పేరు వచ్చింది.
మంజరి బాగా చేసిందని నూన్ షో అయినాక చాలామంది ఫోన్లు చేశారు. ముఖ్యంగా విశ్వనాథ్ గారికి నేను ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తే.. నీ పాత్ర బాగుందని నాకూ ఫోన్లు వచ్చాయని చెప్పారు. ఇటువంటి పాత్రలు మళ్లీ వస్తాయని అనుకోవడం లేదు.
మరి గ్లామర్ పాత్రలు చేస్తారా...?
నటి అన్నాక అన్నీ చేయాలి. ఒకదాంట్లో దొరికినట్లుగా అన్నింటిలోనూ అటువంటివే దొరకవు. అభినయం, గ్లామర్ పాత్రలు చేయడమే నా ధర్మం.
