1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి
  6. Bodygaurd

Saloni Interview | Bodygaurd | బయట ఎన్నో కళ్ళు మాకోసం ఎదురుచూస్తుంటాయి: సలోని

సలోని ఇంటర్య్వూ
WD
మర్యాదరామన్నతో ఒక్కసారిగా హిట్‌తో ముందుకు దూసుకుపోదామనుకున్న సలోనికి రెండవ సినిమా రావడం చాలా కష్టమైంది. చోటా మోటా నటుల్తో 'తెలుగమ్మాయి'లో నటించింది. అందులో ఎమోషన్స్‌ చాలా ఉన్నాయి. ఎడాపెడా మాట్లాడే తనకు తర్వాత చిత్రాల్లో మాటల కంట్రోల్‌ చేసుకోవాల్సి వచ్చిందని అంటుంది. అది ఎలా.. ఏమిటో.. ఆమె మాటల్లోనే....

'బాడీగార్డ్‌' గురించి ఎటువంటి రెస్పాన్స్‌ వచ్చింది?
హిందీ బాడీగార్డ్‌ విడుదలైన వెంటనే తెలుగులో కూడా విడుదలయింది. ఇది ఎలా ఉంటుంది..? అనే అనుమానం చాలామందికి వచ్చింది. అక్కడ హిట్‌ అయిన నెల తర్వాత ఇక్కడ విడుదలయింది. కానీ.. రెండుచోట్ల సమానమైన రిపోర్ట్స్‌ వచ్చాయి. వెంకటేష్‌ వంటి సీనియర్‌ నటుడితో చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. త్రిషతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా వెంకీ లేడీ గెటప్‌కు ప్రేక్షకులు ఎంత ఎంజాయ్‌ చేశారో.. నేను అంతకంటే ఎంజాయ్‌ చేశాను.

మీ పాత్రకు న్యాయం జరిగిందా?
నేను చేసిన పాత్ర చాలా క్లిష్టమైంది. చివరి అరగంట సినిమాలో నా పాత్ర కీలకం. నా పాత్ర కంటతడి పెట్టిస్తుంది. నా ఫ్యామిలీ సినిమా చూసి ఏడ్చేశారు. వారికి భాష రాకపోయినా.. ఎమోషన్స్‌ అర్థమయ్యాయి..

పాత్ర అర్థంతరంగా ముగించడం పట్ల ఎలా ఫీలయ్యారు?
నా పాత్ర చిత్రానికి కీలకమై మలుపు.. నా పాత్రను చంపేయడం వల్ల సింపతీ వచ్చి.. డబ్బులు వస్తున్నాయని తెలిసింది.

కొత్త ఏడాది ఎలా ఉంది?
కొత్త ఏడాదిలో బాడీగార్డ్‌ సినిమా విడుదలై సక్సెస్‌ అయింది. రిలీజ్‌ ముందు టెన్షన్‌ పడ్డాను. నా ఫ్యామిలీ కూడా అలానే ఉన్నారు. రెండవ హీరోయిన్‌ పాత్ర. పాత్ర మంచిదే అయినా.. రిజల్ట్‌ బట్టి తర్వాత కెరీర్‌ ఉంటుందని తెగ టెన్షన్‌పడ్డాం. కానీ నా పాత్రకు బాగా పేరు వచ్చింది.

ఇందులో రిజర్వ్డ్‌గా ఉన్నారు?
నేను గతంలో నటించిన చిత్రాలన్నింటిలో తెగ మాట్లాడేస్తాను. అలా ఉంటేనే నాకు ఇష్టం. కానీ బాడీగార్డ్‌లో దర్శకుడు గోపీచంద్‌ నన్ను కంట్రోల్‌ చేశాడు. నాలోని ఎమోషన్స్‌ బ్రేక్‌ చేశాడు. ఓన్లీ ఫీలింగ్స్‌ మాత్రమే చెప్పగలిగాను.

పోటీతత్వంతో ఇటీవల ఎక్స్‌పోజ్‌లు ఎక్కువయ్యాయి?
సినిమారంగంలో పోటీ ఉంది. కానీ చాలా హెల్దీగా ఉంది. ఎక్స్‌పోజింగ్‌ అనేది పాత్ర మేరకే ఉంటుంది.

కానీ బయట ఫంక్షన్లకు అలానే వస్తున్నారు కదా?
అది మోడ్రన్‌ లుక్‌.. బయట ఎన్నో కళ్ళు మాకోసం ఎదురుచూస్తుంటాయి. ఫంక్షన్లకు ఎట్రాక్షన్‌ కోసం అలా రావాల్సి వస్తుంది. ఇదంతా ఎంటర్‌టైన్‌ చేయడం కోసమే... అంటూ ముగించారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT