గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » నాటి వెండి కెరటాలు » తెలుగు సినీ పరిశ్రమ ఆరాధ్యుడు: ఎన్టీఆర్ (The Legend of Telugu cine Industry: NTR)
నాటి వెండి కెరటాలు
Feedback Print Bookmark and Share
 
అశేష తెలుగు ప్రజల గుండెల్లో పదిలమైన స్థానాన్ని దక్కించుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మించిన రోజు నేడు. ఆయన 1923 మే 28వ తేది, కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.

చిన్నతనం నుంచే రంగస్థలంపై మక్కువ కనబరిచిన ఎన్టీఆర్ అవకాశం దొరికనప్పుడల్లా చిన్న చిన్న పాత్రలు వేస్తుండేవారు. అయితే తన 20వ ఏటనే వివాహం కావడంతో కుటుంబ పోషణ నిమిత్తమై ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆయన ఉద్యోగ వేటలో పడ్డారు. అయితే రంగస్థలంపై నాటకాలను వేయడంతోపాటు సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేంది.

ఎల్వీప్రసాద్ తీయబోయే తదుపరి చిత్రంలో వేషం ఉందని తెలిసి రామారావు శ్రేయోభిలాషి సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్‌ను ఎల్.వి.ప్రసాద్‌కు పరిచయం చేశాడు. ఆయన ఎన్టీఆర్‌ను స్క్రీన్ టెస్టులకు మద్రాసు రమ్మన్నాడు.

మద్రాసులో టెస్టులు చేసిన అనంతరం, తర్వాత కబురు చేస్తాం అని చెప్పి వెళ్లమన్నారు. దీంతో నిరాశకు లోనైన ఎన్.టి.ఆర్ ఉద్యోగం వేటలో పడ్డారు. ఇంతలో ఎల్.వి.ప్రసాద్ "మనదేశం"లో చిన్న వేషం ఇస్తానంటే రామారావు నిరాశపడ్డారు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నటరత్న, ఎన్టీఆర్, జయంతి, కృష్ణా జిల్లా, తెలుగు సినిమా