ప్రధాన పేజివినోదం » వెండితెర » నాటి వెండి కెరటాలు » బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ భానుమతీ రామకృష్ణ (Telugu Entertainment | Telugu Cinema | old cinema | Dr. Bhanumathi Ramakrishna | writer | singer)
అవార్డులు, రివార్డుల విషయానికి వస్తే... ఇప్పటిదాకా భానుమతిగారు మూడుసార్లు జాతీయస్థాయి ఉత్తమనటిగా అవార్డులు అందుకున్నారు. తమిళనాట కూడా ఆమె చిత్రాలు విజయదుందుభిని మోగించాయి. అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై భానుమతికి ‘కలైమామణి’ బిరుదును ఇచ్చి సత్కరించడం విశేషం. తమిళనాట ఆమెను అష్టావధానిగా పిలిచేవారు. ఎందుకంటే అప్పటికే భానుమతి నటిగానేగాక, తన పాత్ర కు తానే పాటలు స్వయంగా పాడుకునేవారు.
దాదాపు 200కు పైగా చిత్రాలలో నటించిన భానుమతి మూడుతరాల నటులతో పనిచేసిన భానుమతిగారు... ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో "మంగమ్మగారి మనవడు" చిత్రంలో నటించడమేగాక, ఆ చిత్రంలో టైటిల్ రోల్‌ను కూడా పోషించారు. రచయితగా ఆమె రాసిన "అత్తగారి కథలు" ఆంధ్రలో విశేష ప్రాచుర్యం సంపాదించాయి. ఆ కథలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది.
అంతేగాకుండా... భానుమతిగారు చేసిన సాహిత్యసేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెకు "పద్మశ్రీ" బిరుదును ఇచ్చి సత్కరించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం భానుమతి కళాసేవను గుర్తించి ఆమెకు "కళాప్రపూర్ణ" బిరుదుతో డాక్టరేట్‌ను ఇచ్చి సత్కరించింది. ఆమె ‘నాలోనేను’ అనే స్వీయ నవలను కూడా రచించారు. అత్తగారి కథలు, నాలో నేను గ్రంథాలు ఆమెలోని ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.
తన బహుముఖ ప్రజ్ఞా విశేషాలతో ఎన్నో సాధించి, ఎందరికో ఆదర్శంగా నిలిచిన భానుమతీ రామకృష్ణ 2005వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆ రకంగా మహానటి శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయినా.. ఆమె గళం నుంచి జాలువారిన "కోతి బావకు పెళ్లంట", "ప్రేమే నేరమౌనా", "ఓ బాటసారి నను మరువకోయి", "శ్రీకర కరుణాల" గీతాలు మాత్రం ఎప్పటికీ అజరామరంగా నిలిచే ఉంటాయి.