జూదం మనిషిని ఎంత ఆకర్షిస్తుందో... ఆ జూదంలో నెగ్గేందుకు వ్యసనపరుడైన వ్యక్తి ఎలాంటి పనులకు పూనుకుంటాడో... చివరికి అతని పరిస్థితి ఎలా తయారవుతుందో నాటి రచయిత కొసరాజు కళ్లకు కట్టినట్లు అందించారు. ఆ సాహిత్యానికి మాధవపెద్ది, పిఠాపురం, రాఘవులు జీవం పోశారు. నటనలో రమణారెడ్డి, రేలంగి ప్రాణంపోశారు. కులగోత్రాలు సినిమాలోని ఈ పాట... అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనేఉన్నది కాస్తా వూడింది సర్వమంగళం పాడిందిపెళ్లాం మెళ్లో నగలతో సహా తిరుక్షవరమై పోయిందిఅయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనేఅయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే