'సుభాష్'ఆడియో విడుదల
హైదరాబాద్ (ఏజెన్సీ), శుక్రవారం, 6 జులై 2007( 12:17 IST )
భూ కబ్జాల నేపథ్యంలో శివసాయి ప్రొడక్షన్స్ 'సుభాష్' చిత్రాన్ని రూపొందించింది. తానే హీరోగా నటించి దర్శక నిర్మాత బాధ్యతలు నిర్వహిస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి. ఈ చిత్రంలో ప్రవళ్లిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను గురువారం విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీహరి ఆడియో కేసెట్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరిపైనా ఆధారపడకుండా అన్నీ తానై చిత్రాన్ని ధైర్యంగా నిర్మించిన శ్రీనివాస రెడ్డిని అభినందించారు.'ఎంజాయ్'చిత్రం తర్వాత తాను ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరిస్తున్నానని సెన్సార్ సభ్యులు ఉప్పునూతల ప్రజ్యోత్ రెడ్డి అన్నారు. ఆడియో,సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని అశిస్తున్నానని దర్శక నిర్మాత శ్రీనివాస రెడ్డి తెలిపారు.
శ్రీనివాసరెడ్డి తన శిష్యుడనీస,ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి అని సత్యంయాబి అన్నారు. ఈ చిత్రంలో పాటలన్నీ ముందుగా విన్నాననీ,వీనుల విందుగా ఉన్నాయనీ ప్రవళ్లిక చెప్పారు. ఈ చిత్రానికి నిర్వహణ కాసుల శ్రీధర్ కాగా కథ, మాటలు, సంగీతం, స్ర్కీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం..బొందుగుల శ్రీనివాస రెడ్డి.