గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » సురేష్ గోపీ ప్రధాన పాత్రలో పోకిరి రాజా ఎంబీఏ
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
Pokiri Raja MBA
WD PhotoWD
సురేష్ గోపి ప్రధాన పాత్రలో రూపొందుతున్న పోకిరి రాజా ఎంబీఏ చిత్రం రావూరి వెంకటస్వామి నిర్మాణ సారథ్యంలో చిత్రీకరిస్తున్నారు. పూర్తి యాక్షన్, ఎంటర్‌టైనర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మళయాళంలో కిచామణి ఎంబీఏ ఆధారంగా చిత్రీకరించారు.

ఈ చిత్రానికి సంబంధించి అనువాద కార్యక్రమాలు ఇటీవలే పూర్తయిన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మామూలు కథే అయినా కథలో వైవిధ్యం కనబడుతుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని కాపాడుతూ చట్టానికి, గూండాయిజానికి మధ్య వారధిగా సంఘ విద్రోహుల ఆగడాలను ఆటకట్టించే పాత్రలో సురేష్ చక్కగా నటించారని తెలిపాడు.

సురేష్ అంటే డైలాగ్స్ ఇంక చెప్పనవసరం లేదు.. ఆయనకు తగ్గట్టుగానే తెలుగులో మల్లూరి వెంకట్ అద్భుతంగా రాశారని ప్రశంసించాడు. అంతే కాక సురేష్ నటించిన మరో చిత్రం ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా తెలుగులో అనువదించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీలైనంత త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోకిరి రాజా ఎంబీఏ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా బిజు మీనన్, నవ్యా నాయర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే సాహితీ ఈ చిత్రానికి టైటిల్ సాంగ్‌ను రాసింది.