త్వరలో "కృష్ణ" ఆడియో ప్లాటినం సంబరాలు
|
ఈ నేపథ్యంలో దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ.. త్వరలో ప్లాటినం డిస్క్ సంబరాలను జరపాలనే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి ఈ చిత్రానికి మంచి సంగీతబాణీలను ఎంతో కష్టపడి అందించారని ప్రశంసించారు. రవితేజ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండ ఈ కథకు బ్యాక్ డ్రాప్‌గా నడుస్తుండటంతో 'ది పవర్ ఆఫ్ ఇంద్రకీలాద్రి' అన్న క్యాప్షన్‌ని కూడా జోడించామన్నారు. అనంతరం రవితేజ మాట్లాడుతూ 'సింధూరం'లో 'హాయ్‌రే హాయ్.. జాంపండు రోయ్..' అంటూ నాతో తొలి సోలో సాంగ్‌ను చేయించిన చంద్రబోస్ ఈ చిత్రంలో అన్ని పాటలు రాశారని చెప్పారు.
చక్రి కాంబినేషన్‌లో చాలా మ్యూజికల్ హిట్స్ వచ్చాయని... ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణను పొందుతున్నాయని రవితేజ చెప్పారు. చక్రి మాట్లాడుతూ ఈ చిత్రంలోని పాటలు రవితేజను ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని ఎంతో కష్టపడి చక్కటి బాణీలను అందించామన్నారు.
