1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

డిసెంబరులో తెరపైకి "కింగ్"

డిసెంబరు తెరపైకి కింగ్ నాగార్జున దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌  కామాక్షి మూవీస్ పతాకం
WD PhotoWD
అక్కినేని నాగార్జున, దర్శకుడు శ్రీనువైట్ల కాంబినేషన్‌లో కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం కింగ్. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబర్ వరకు జరిగే నాన్‌స్టాప్ షూటింగ్‌తో చిత్రాన్ని పూర్తి చేసి డిసెంబర్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

డిసెంబరులో విడుదలైన నాగార్జున చిత్రాలు మన్మథుడు, మాస్, డాన్ విజయవంతం కావడంతో డిసెంబర్ 18న "కింగ్"ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని ఆయన చెప్పారు.

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ... నాగార్జునతో తను చేస్తున్న మొదటి చిత్రమిదని, ఆయన కెరీర్‌లో ఓ విభిన్న చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్ టేసే విధంగా "కింగ్" రూపుదిద్దుకుంటోందని అన్నారు. ఇంకా ఈ చిత్రానికి సంగీతం... దేవీశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ... ప్రసాద్ మూరెళ్ళ.. స్టోరీ డిపార్ట్‌మెంట్... కోన వెంకట్, రామలక్ష్మణ్, ఎడిటింగ్.. ఎ.ఆర్.వర్మ, ఆర్ట్. ఎ.ఎస్. ప్రకాష్.
About Writer
Selvi