ప్రధాన పేజి > వినోదం > వెండితెర > రాబోయే చిత్రాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "యువత"  Search similar articles
నిఖిల్
WD PhotoWD
వర్త్ వాచింగ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ కథానాయకునిగా, అక్ష హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం యువత. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ చిత్రాన్ని హరి నిర్మిస్తుండగా, పరశురామ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత హరి మాట్లాడుతూ... పాటలను ఈ నెల 10 నుంచి వైజాక్, అరకు, భీమిలి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు అన్నారు. మిగిలిన రెండు పాటల చిత్రీకరణ పూర్తయితే చిత్ర షూటింగ్ పూర్తవుతుంది.

మణిశర్మ సమకూర్చిన బాణీలు అద్భుతంగా వచ్చాయి. ఈ నెలలో ఆడియో, వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు హరి వెల్లడించారు. యువత పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని
11న విడుదల కానున్న 'కుర్‌కురే'
జూలై రెండో వారంలో "మా ఆయన చంటి పిల్లాడు"
జూలై 11న వస్తున్న "బ్రహ్మానందం డ్రామాకంపెనీ"
మలేషియా వెళ్లనున్న "ప్రేమోత్సవం"
నిండు పౌర్ణమిలోగా వికసించిన "నెలవంక" ప్రేమ
జూలై 4న రానున్న "నిన్న నేడు రేపు"