1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

25న తెరపైకి "ఇట్లు నీ వెన్నెల"

25న తెరపైకి
WD
వాసు, వర్షీనియా హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఇట్లు నీ వెన్నెల". మామిడి కృష్ణ దర్శకత్వంలో శ్రీమతి. డా. కుసుమ రావు నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైందని చిత్రయూనిట్ వెల్లడించింది.

ప్రేమకథా నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో, ప్రేమ అనేది జీవితం కాదని, జీవితంలో ప్రేమ ఒక భాగమే అనే సందేశాన్ని కూడా చెబుతూ తెరకెక్కించనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఎం.ఎస్. నారాయణ, కొండవలస, గుండు హనుమంతరావు, చిట్టిబాబు, గౌతం రాజు, అపూర్వ, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు జె.ఎ. సుందర్ సంగీతం సమకూర్చారు.
About Writer
Selvi