గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » 24న వస్తోన్న ముమైత్ ఖాన్ "టార్గెట్" (Mumaith target comes on 24th)
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
WD
శివబాలాజీ, శ్రద్ధాదాస్ జంటగా రమేష్ రాజా దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం "టార్గెట్". ఈ చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర సమర్పకుడు ఆర్.కె.గౌడ్ తెలిపారు. గురువారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందులో ప్రతి పాత్ర చక్కగా నటించారన్నారు.

సినిమా చూసి నచ్చాకే విడుదల చేస్తున్నానని, వంద ప్రింట్లతో రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు గౌడ్ వెల్లడించారు. ఓ రచయిత్రి నవలలో జరిగిన సంఘటనలు నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుందన్నారు. సెక్సీతార ముమైత్‌ఖాన్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించిందని సమర్పకుడు అన్నారు.

నిర్మాత దశరథ సంగిశెట్టి, బి. రామకృష్ణ మాట్లాడుతూ.. ఇందులోని ప్రతి పాత్రకు ఓ టార్గెట్ ఉంటుందని చెప్పారు. అదే ఈ చిత్రం ప్రధాన పాయింట్ అని, ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. నిర్మాత ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని, ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని దర్శకుడు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ముమైత్ ఖాన్ టార్గెట్ శివబాలాజీ శ్రద్ధాదాస్ ఆడియో నవల