1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. ముస్తాబవుతోన్న "ఎవరైనా ఎప్పుడైనా"

"Evarina Epudina" Ready for release | ముస్తాబవుతోన్న "ఎవరైనా ఎప్పుడైనా"

వినోదం
WD
ఏవీఎం ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ సందేశ్, విమలరామన్ జంటగా నటిస్తోన్న చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా". మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

ఇదొక ప్రేమకథా చిత్రమని, వినోదభరితంగా సకుటుంబ సమేతంగా చూసి ఆనందించేలా రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. చదువు పూర్తిచేసిన యువకుడిగా కనిపించే కథానాయకుడు వరుణ్ సందేశ్ పాత్ర స్వరూప స్వభావాలు వైవిధ్యంగా కన్పిస్తాయని చెప్పారు. దీనికి అనుగుణంగానే సన్నివేశాలు కొత్తగా ఉంటాయని దర్శకుడు వెల్లడించారు.

ఇందులో విమల రామన్ కళాశాల విద్యార్థినిగా కన్పిస్తుందని, కథానాయకుని జీవితంలో ప్రేమ, దాని తాలూకు అనుభూతులు, వాటితో అతని ప్రయాణం ఎలాంటి గమ్యం చేరుకుంటుందన్నదే చిత్రమని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలోని ఆరు గీతాలకు మణివర్మ స్వరాలు చిత్ర విజయానికి ఎంతో దోహదపడతాయన్నారు. ఈ నెలలోనే ఆడియోను, జూన్‌లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు.

కోటశ్రీనివాసరావు, గిరిబాబు, అలీ, వేణుమాధవ్, వైజాగ్‌ప్రసాద్, సంపత్, రమాప్రభ, కోవైసరళ, రాధాకుమారి, తెలంగాణా శకుంతల, పావలా శ్యామల తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు.. రాజసింహ, పాటలు.. వేటూరి, వెన్నెలకంటి, భాస్కరపట్ల, ఆర్ట్.. వివేకానంద, నిర్మాతలు.. ఎం. ఎస్. గుహన్, అరుణ గుహన్, అపర్ణ గుహన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. మార్తాండ్ కె. శంకర్.
About Writer
SELVI.M