1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు
  6. Aryan Rajesh

Romio| Aryan Rajesh| Sri Hari| Sradha Arya| A Different Lover | జూలై మూడో వారంలో వస్తోన్న "రోమియో"

రోమియో
WD
శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌లు కలిసి నటించిన చిత్రం "రోమియో". శ్రద్ధాఆర్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ఎ డిఫరెంట్ లవర్‌ (ట్యాగ్ లైన్)గా ఆర్యన్ రాజేష్ కన్పిస్తారు.

సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూలై మూడో వారంలో తెరకెక్కనుందని నిర్మాత శ్రీనివాస్ తెలిపారు.

శ్రీహరి, ఆర్యన్ రాజేష్ తమ నటన ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారని శ్రీనివాస్ వెల్లడించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని నిర్మాత అన్నారు.

దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను కలుగజేసే చిత్రమిదన్నారు. అనిల్ అంబాని లాంటి ఓ ధనవంతుడైన వ్యక్తి పాత్రను శ్రీహరి పోషించారు. ఆయనకు చెల్లెలుగా శ్రద్ధాఆర్య నటించింది. కథానాయిక అయిన శ్రద్ధాఆర్య ప్రేమను హీరో ఎలా పొందాడన్నది తెరపై చూడాల్సిందేనని రామకృష్ణ చెప్పారు.

ఇందులో శ్రీహరికి అపోజిట్‌ విలన్‌ పాత్రలో చరణ్‌రాజ్ నటించగా, శ్రీహరికి పి.ఏ. పాత్రను రఘుబాబు పోషించారు. పాటలతో పాటు మంచి ఫైట్స్ కూడా ఇందులో ఉన్నాయని దర్శకుడు వెల్లడించారు.

మంచి కథాబలం కలిగిన ఈ చిత్రంలో నటించడం ఆనందాన్నిచ్చిందని హీరో ఆర్యన్ రాజేష్ తెలుపగా, తాను నటించిన రెండవ చిత్రమిదని, సంప్రదాయానికి గౌరవమిచ్చే, ప్రేమ పట్ల నమ్మకం కలిగిన అమ్మాయి పాత్ర తనదని హీరోయిన్ శ్రద్ధాఆర్య వెల్లడించింది.

ఇంకా ఈ చిత్రంలో చంద్రమోహన్, తనికెళ్ళభరణి, సంతోష్‌పవన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, గౌతంరాజు, సైరాభాను, వైజాగ్ ప్రసాద్, హర్షవర్ధన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి పాటలు: వనమాలి, సంగీతం: అగస్త్య, కెమెరా: రాజేంద్ర, ఎడిటింగ్: శంకర్, ఆర్ట్: మురళి, ఫైట్స్: గణేష్, నిర్మాత: శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ.
About Writer
SELVI.M