ప్రధాన పేజివినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » 25న ప్రేక్షకుల ముందుకు "మా నాన్న చిరంజీవి" (Maa Nanna Chiranjeevi| Cinema| Preview| Jagapathi Babu| Master Athulith| Tulasi| Venkatesh)
ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా 'తమ్ముడు' ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మా నాన్న చిరంజీవి". లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం గురించి హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. అరుణ్‌ప్రసాద్ కథ చెప్పగానే నచ్చింది. భారీ బడ్జెట్ సినిమాగా, తన క్యారెక్టర్‌ను అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. ఇందులో తన క్యారెక్టర్ పేరు చిరంజీవి, తన కొడుక్కి పెద్ద హీరోని. బాగా స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్. ప్రతి మనిషికి స్ట్రగుల్ వుంటుంది.
కానీ మనం ఎలాంటి స్ట్రగుల్ ఎదుర్కొంటున్నా.. నవ్వుతూ ముందుకు సాగాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ అంశాల కలబోతగా ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేసిందని జగపతి బాబు అన్నారు.
ఈ చిత్ర దర్శకుడు అరుణ్‌ప్రసాద్‌తో మరో సినిమా చేయడానికైనా రెడీగా ఉన్నాను. రెండు గంటల పాటు హ్యాపీగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటదని హీరో చెప్పారు.
"శుభలగ్నం"లో ఆమని క్యారెక్టర్‌ని పోలి వుండే పాత్రను నీలిమ చక్కగా చేసింది. అతులిత్‌తో పుల్‌లెంగ్త్ క్యారెక్టర్ చేయలేనేమోనని అనిపించింది. కానీ అరుణ్‌ప్రసాద్ నమ్మకంతో మా ఇద్దరి చేత ఈ సినిమా చేయించాడు. ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అయి అందరికీ పేరు సంపాదించి పెడుతుందని జగపతి బాబు నమ్మకం వ్యక్తం చేశారు.
హీరోయిన్ నీలిమ మాట్లాడుతూ.. జగపతిబాబుతో కలిసి నటించడం చాలా ఆనందం కలిగించింది. తన పాత్ర ఎంతో నచ్చి ఎంజాయ్ చేస్తూ నటించాను. ఈ సినిమా తనకు హీరోయిన్‌గా మంచి బ్రేక్ తెచ్చిపెడుతుందనే నమ్మకముందన్నారు.
మాస్టర్ అతులిత్ మాట్లాడుతూ.. వెంకటేష్‌తో నటించిన "తులసి" చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాగే జగపతిబాబుతో చేసిన "మా నాన్న చిరంజీవి" కూడా సూపర్‌హిట్ అవుతుందని ఆశిస్తున్నానని చెప్పారు.
జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్, అలీ, ఎం.ఎస్. నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, తెలంగాణ శకుంతల, ఝాన్సీ, బెనర్జీ, సంధ్య, ఆచార్య, సత్యం రాజేష్, చిత్రం శ్రీను, మున్నా వేణు, రాగిణి, కల్పన తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: హేమచంద్ర, ఫోటోగ్రఫీ: భరణి కె. ధరన్, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, ఆర్ట్: కె.వి. రమణ, స్టిల్స్: మల్లేష్, ఎడిటింగ్: బస్వా పైడిరెడ్డి.