Maryada ramanna | Sunil | Saloni | Ravi Teja | Rajamouli | "మర్యాద రామన్న" సైకిల్‌కు క్రేజీస్టార్ రవితేజ వాయిస్..!
WD
ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన యార్లగడ్డ శోభు మాట్లాడుతూ.. "ఇటీవల వేల్ రికార్డ్స్ ద్వారా విడుదలైన 'మర్యాద రామన్న' ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. రాజమౌళి-కీరవాణి కాంబినేషన్‌లో ఇది మరో మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా రీ-రికార్డింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్‌లో సునీల్, సలోనిలపై "రాయె రాయె సలోని.." అనే పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటతో మొత్తం సినిమా పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం" అన్నారు.
"మర్యాద రామన్న"కు క్రేజీస్టార్ రవితేజ వాయిస్..!
మరో నిర్మాత ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో సైకిల్ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. సినిమాలో ఓ క్యారెక్టర్‌లా సైకిల్ కంటిన్యూగా వుంటుంది. దీనికి క్రేజీస్టార్ రవితేజ వాయిస్ ఇవ్వడం విశేషం. సినిమాకి ఇదొక హైలైట్‌గా నిలుస్తుంది. ఈ నెల 23న విడుదలవుతున్న ఈ చిత్రం మా బేనర్‌కి పెద్ద హిట్‌గా నిలుస్తుంది" అన్నారు.
సునీల్, సలోని, నాగివీడు, బ్రహ్మాజీ, రావు రమేష్, సుప్రీత్, వేణుగోపాల్, ప్రభాకర్, కాంచీ, అనూజ్ గుర్వార్, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: ఎస్.ఎస్. కాంచీ, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంతర శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, చైతన్య ప్రసాద్. సంగీతం: కీరవాణి, స్టైలింగ్: రమా రాజమౌళి, నిర్మాతలు: ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎస్.ఎస్. రాజమౌళి.
