గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » మరో సందేశాత్మక చిత్రమే 'శివాజీ' (ది బాస్)
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
నటీనటులు... సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రియా, వివేక్, సుమన్, మణివణ్ణన్, రాజా, వడివుక్కరసు తదితరులు.
పతాకం - ఎవీఎమ్.ప్రొడక్షన్స్
సంగీతం - ఎఆర్ రహమాన్
సమర్పణ - బెల్లంకొండ సురేష్
నిర్మాతలు - ఎమ్.శరవణన్, ఎమ్.ఎస్.గుహన్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - శంకర్

గతంలో 'ఒకే ఒక్కడు', 'భారతీయుడు', 'అపరిచితుడు' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన తమిళ దర్శకుడు శంకర్‌ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర లేదు. ఇటీవలి కాలంలో యువ దర్శకులను ప్రోత్సహిస్తూ వచ్చిన శంకర్ తాజాగా దక్షిణ భారత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన సంచలన చిత్రమే శివాజీ (ది బాస్).

సాధారణంగా శంకర్ సినిమా అనగానే ప్రేక్షకులు ఏదైన సామాజిక సందేశంతో కూడిన సినిమా అనే భావిస్తారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే శివాజీ సినిమా కూడా సందేశాత్మకంగానే తీశారు. భారతదేశం అందరూ అనుకున్నట్టుగా పేద దేశం కాదని సంపదంతా కొంతమంది పెట్టుబడిదారుల చేతిలో నల్లధనంగా ఉందని గ్రహిస్తాడు. ఆ బ్లాక్ మనీని కనుక ప్రజల కోసం ఖర్చు పెడితే వేలాది మంది పేద విద్యార్థులు ఉచిత విద్యతో పాటు కోట్ల మంది పేద ప్రజలు ఉచిత వైద్య సౌకర్యం పొందగలరు. ఈ సమస్యలకు పరిష్కారంమే శివాజీ చిత్రం కథాంశం.