జేకే రౌలింగ్ ఏ ముహుర్తంలో 'హర్రి పోట్టర్' నవల రాసిందో గానీ ప్రపంచ వ్యాప్తంగా ఊహించని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆమె రాసిన ఆరు భాగాలు మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా రాసిన ఏడవ భాగం ఈనెల 21వ తేదీన బయటకు రానుంది. విశ్వవ్యాప్తంగా యువతను ఆకట్టుకున్న ఆ నవల నాలుగు భాగాలు వెండి తెరకెక్కాయి. తాజాగా ఐదో భాగం విడుదలైంది.
WD Photo
WD
ఇందులో విశేషమేమింటంటే చివరి 20 నిమిషాలు త్రీడీ ఫార్మెట్‌లో ఉండడం. 'హర్రి పోట్టర్ అండ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫోనిక్స్' పేరుతో ఐదవ భాగం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇండియాలోనే మొట్టమొదటి సారిగా త్రీడి భాగాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో విడుదల చేశారు. శుక్రవారం ఈ చిత్రాన్ని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు.
హర్రి పోట్టర్ సినిమాలో బాలనటునిగా కనిపించిన డేనియల్ రాడ్‌క్లిఫ్ ఈ చిత్రంలో టీనేజర్‌గా కనిపించాడు. తెరమీద ఆయన కనిపించగానే థియేటర్‌లోని ప్రేక్షకులంతా కేరింతలు కొట్టారు. కథాపరంగా చెప్పాలంటే.. మ్యాజిక్ స్కూల్‌లో ఐదో ఏడాదిలో హర్రి పోట్టర్ ప్రవేశించడంతో కథ ప్రారంభమవుతుంది. తను స్కూల్‌కు వచ్చేందుకు రైలు ఎక్కినపుడు దెయ్యాల గురువు కనిపిస్తాడు. ఈయన నిద్రలో కూడా హర్రి పోట్టర్‌ను భయపెడుతుంటాడు.
ఈ విషయాన్ని స్కూల్‌లో ఎవరికి చెప్పినా నమ్మరు. టీచర్ ఈ విషయాన్ని కొట్టిపారేస్తూ.. ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ మ్యాజిక్ నేర్చుకోవాలని హితబోధచేస్తుంది. కానీ దష్టశక్తుల్ని ఎదుర్కొనేందుకు ఈ శక్తి చాలదని గ్రహించినహర్రి పోట్టర్ కొంతమందిని పోగు చేసి రహస్యంగా తర్ఫీదు ఇస్తాడు. ఆఖరికి ఈ విషయం టీచర్‌కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమయిందనేదేది ఈ చిత్రం కథాంశం.