గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » వినోదభరితం 'శంకర్‌దాదా జిందాబాద్'
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
నటీనటులు: చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కొటక్, దిలీప్ ప్రభోల్కర్, షియాజీషిండే, వేణుమాధవ్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, శరత్‌బాబు, రోహిత్, సదా, ప్రత్యేక పాత్రల్లో పవన్‌కళ్యాణ్, నాగబాబు, రవితేజ, అల్లు అర్జున్.
కెమెరా : ఛోటాకే నాయుడు,
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్,
దర్శకత్వం : ప్రభుదేవా,
మూలం : 'లగేరహో మున్నాభాయ్'.

రౌడీగా చలామణి అయ్యే ఓ వ్యక్తి అమ్మాయి ప్రేమలోపడితే ఎలా పరివర్తన చెందాడన్నదే క్లుప్తంగా కథ. ఈ సూత్రంతో ఎన్నో సినిమాలు వచ్చాయి. కాకపోతే గాంధీమార్గం ద్వారా సమాజంలో ఉన్న అవినీతిని, తనకున్న సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడన్నదే కొత్తదనం. సాంకేతిక మార్పులవల్ల చోటుచేసుకున్న ఎఫ్.ఎం. రేడియో ద్వారా వివిధ సమస్యల్ని ఎలా పరిష్కరించవచ్చనే అంశాలకు పరిష్కారం కథలో కొత్తదనం.

శంకర్ ప్రసాద్ (చిరంజీవి) దాదాగిరీ చేస్తూ సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతను చేయాల్సిన సెటిల్‌మెంట్లకు కుడిభుజంగా ఉండే ఎటిఎం (శ్రీకాంత్). ఇతనితోపాటు కొందరు శిష్యులు ఇతని పరివారం. ఎంత వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఎఫ్.ఎం. రేడియోలో 'హలో గుడ్‌మార్నింగ్' అంటూ పలుకరించే జాహ్నవి (కరిష్మాకొటక్) గొంతంటే శంకర్‌కు వల్లమాలిన ఇష్టం. ఆమెను ఒక్కసారైనా కలుసుకోవాలనుకున్న శంకర్‌ప్రసాద్‌కు అక్టోబర్ రెండున బాపు జన్మదినం సందర్భంగా ఎఫ్.ఎం.రేడియో పెట్టే కాంటెస్ట్‌లో పాల్గోనే అవకాశం కలుగుతుంది. రేడియోలో ఆమె అడిగే ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే ఎఫ్.ఎం.రేడియో కార్యాలయంలో జాహ్నవిని కలుసుకుని శ్రోతలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. దీంతో తనకు తెలిసిన దాదాగిరీ విద్యతో కొందరి ప్రముఖుల్ని బంధించి వారు చెప్పిన సమాధానాల్ని జాహ్నవి అడిగిన ప్రశ్నలకు తన సమాధానాలుగా చెబుతాడు. దీంతో అక్టోబర్ రెండున ఆమెను కలుసుకోవడమే తరువాయి. ఇక అక్కడ శ్రోతలతో మాట్లాడుతూ తాను 'ప్రొఫెసర్‌న'ని జాహ్నవికి అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుని మరింత దగ్గరవ్వాలనుకుంటాడు.

'సెకండ్ ఇన్నింగ్స్ హోమ్' పేరుతో ఉండో గృహంలో కొడుకుల నుంచి దూరం కాబడిన వృద్ధులైన ఓ ఐదుగురు తన తండ్రి స్నేహితులతో జాహ్నవి నివశిస్తుంటుంది. ఈ వయసులో బాధలు మర్చిపోయి హాయిగా ఉండాలంటూ వారికి చెబుతూ గాంధీ గురించి బాగా తెలిసిన ప్రొఫెసర్‌ను ఒకసారి ఇంటికి తీసుకువస్తానని అంటుంది. దీనికి కమిట్ అయిన శంకర్ అర్జంట్‌గా గాంధీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఓ లైబ్రరీకి వెళ్ళి గాంధీగారి జీవితాన్ని కాచివడపోయాలనుకుంటాడు. రోజంతా అదేవ్యాపకంతో ఉన్న శంకర్‌ప్రసాద్‌కు గాంధీ నిజంగా బతికివచ్చినట్లు ఎటిఎం కూడా నాటకమాడతాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ 'సెకండ్ ఇన్నింగ్ హోమ్'కు వెళ్ళి వారేసిన ప్రశ్నలకు గాంధీ ఆత్మ ద్వారా సరైన సమాధానాలు చెప్పి వారి హృదయాల్ని దోచుకుంటాడు. వారితోపాటు జాహ్నవి మనసులో స్థానం సంపాదిస్తాడు. తన ప్రేమ విషయాన్ని ఎలా చెప్పాలన్న సందిగ్ధంలో... ఓ సారి తనతో దాదాగిరి చేయించే బిల్డర్ రాజలింగ (షిండే)ను సలహా అడుగుతాడు. నీకు ధైర్యంలేకపోతే నీమాటగా తాను చెబుతానంటూ రాజలింగం ఆ ఇంటి అడ్రస్ అడుగుతాడు. అంతకుముందే ఆ ఇల్లును ఖాలీచేయించి తన కూతురు (సదా) పెండ్లి కానుకగా ఇవ్వాలనుకున్న ఇల్లని గ్రహించిన రాజలింగం మాటమార్చి... ఆ ఇంటివారందరినీ సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లి సమయం చూసి ధైర్యంగా ప్రేమ విషయం చెప్పేయమని సలహా ఇస్తాడు. అలా వారితో వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తున్న శంకర్‌ ప్రసాద్‌కు 'సెకండ్ ఇన్నింగ్స్ హోమ్‌'ను రాజలింగం ఖాళీచేయిస్తున్నాడన్న విషయ్ తెలిసి నిలదీస్తాడు. అంతా ప్లాన్డ్‌గా శంకర్‌ను ఈ విషయంలో ఇరికించిన రాజలింగం ఇవన్నీ నీవేచేశావని జాహ్నవికి చెప్పేస్తానని బెదిరిస్తాడు. గాంధీకిచ్చిన మాట ప్రకారం దాదాగిరి దూరంగా ఉన్న శంకర్ ఆ తర్వాత రాజలింగం నుంచి ఆ ఇంటిని ఎలా రాబట్టుకున్నాడు? తాను ఎలామారాడు? చుట్టూ ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించాడు? ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర ఏమిటి? అనేది మిగిలిన కథ.

కథలో అంతర్భాగంగానే హాస్యం సాగుతుంది. చిరు చాలాసార్లు ప్రేక్షకుల్నిల నవ్విస్తాడు. శంకర్ ప్రసాద్ ఇంట్రడక్షన్ 'గ్యాంగర్ లీడర్'ను గుర్తుచేస్తుంది. 'ఓ పిల్లవాడి అర్థరూపాయి పోతే తానే జోబులోంచి తీసి ఇచ్చి ఇదే నీ రూపాయంటూ' జీవితంలో ఒకేఒక్కసారి అబద్ధం ఆడానని శంకర్‌ప్రసాద్ జాహ్నవికి చెబుతుంటే... ఎఫ్ఎం రేడియోలో ఈ మాటలు విని 'వీడు రాజకీయాల్లోకి వెళితే పైకివస్తాడని' రాజలింగం చెప్పడం.. త్వరలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తాడేమోనన్న ఆలోచన రేకెత్తించాడు. గాంధీ గురించి లెక్చరర్ ఇస్తూ... దేశం ఏం అభివృద్ధి చెందిందంటూ.. కుంభకోణాలు, ఆకలిచావులు ఇదా అభివృద్ధని ప్రభుత్వాన్ని పరోక్షంగా ఎత్తిచూపినట్లుంది. 'సత్యమే పలకాలని గాంధీ పాత్రధారి శంకర్‌కు వెన్నంటి ఉంటూ బోధిస్తుంటాడు.

కాలేజీలో జాహ్నవిని శంకర్ కలిసే ఓ సన్నివేశంలో 'హూ ఈజ్ హీ' - 'హిమస్ట్‌బి హర్ ఫాదర్' అని స్నేహితులు చర్చించుకోవడం చిరు వయస్సును గుర్తుచేస్తూ హాస్యంగా రాసినట్లుంది. సంగీతపరంగా దేవీశ్రీప్రసాద్ ఆకట్టుకునే బాణీలు ఇచ్చారు. 'గుడ్‌మార్నింగ్ హైదరాబాద్', 'జగదేకవీరుడు అతిలోక సుందరి' పాటల్లో చిరు డాన్స్ బాగుంది. రెండో పాటలో రవితేజ, ప్రభుదేవా, అల్లు అర్జున్, నాగబాబు కన్పించడం హైలైట్, క్లైమాక్స్‌లో పవన్‌కళ్యాణ్ పాత్రద్వారా 'మనసులు కలిస్తేచాలు జాతకాలు పట్టించుకోనని' చెప్పిన డైలాగ్‌కంటే పవన్ ప్రవేశానికే కరతాళధ్వనులుపడ్డాయి. 'దేశం మనదే - మనుషులే పరాయివాళ్ళు' అనేడైలాగ్‌తో పరుచూరి బ్రదర్స్‌లో వాడి తగ్గలేదనిపించింది. సందర్భం వేరైనా జీవితంపై విరక్తిచెందిన రొటీన్ పాత్రను రోహిత్ ఇందులోనూ పోషించినా, దానికి సెంటిమెంట్ బాగా పండింది. ఆద్యంతం వినోదంతోసాగే ఈ చిత్రం కుటుంబంతో చూడతగిందనడంలో ఏ మాత్రం సందేహంలేదు.