గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » 'హలో హిట్టిస్తారా' అంటున్న సాయిరాంశంకర్-షీలా
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD PhotoWD
సినిమా పేరు..: హలో ప్రేమిస్తారా...?
విడుదల..: శుక్రవారం.
తారాగణం...: సాయిరాంశంకర్, షీలా, సునీల్, బ్రహ్మానందం, విజయ్ కుమార్, వైజాగ్ ప్రసాద్, ఆలీ, చంద్రమోహన్, సుధ తదితరులు.

సాంకేతికవర్గం..: కెమెరా.. భరణి, పాటలు.. కందికొండ, ఫైట్స్..రామ్‌లక్ష్మణ్, సంగీతం.. చక్రి, సమర్పణ.. దిల్ రాజు, నిర్మాత.. పూరీ జగన్నాథ్, దర్శకుడు.. రాజ్‌‌కుమార్.

కథ.. మానసికంగా దెబ్బతిన్న తన తనయుడు గురించి డాక్టర్ (వైజాగ్ ప్రసాద్)ను వాకబు చేస్తూ విజయకుమార్ కనిపించే సన్నివేశంతో సినిమా ఆరంభమవుతుంది. 15 ఏళ్లుగా తగ్గని జబ్బు ఎన్నాళ్ళకు తగ్గుతుందని అడుగుతుండగా విజయకుమార్ డాక్టర్‌ను అడుగుతాడు. ఇంతకీ మీ వాడేం చేస్తున్నాడు అని డాక్టర్ అడగ్గానే.. కోల్‌కతాలో అరవింద్ (సాయిరాం శంకర్) రోడ్ల మీద స్నేహితలతో డాన్స్‌‌లు వేస్తూ కనిపిస్తాడు. 'లైఫంటే.. ట్రావల్' అనే తొలి పాట మ్యూజిక్ మోతలో అర్థం కాకుండా సాగిపోతుంది.

ఇక అరవింద్ విషయానికొస్తే.. బద్ధకస్తుడు. ఇంటర్వూ ఉన్న ఆలస్యంగా వెళ్లడంతో అక్కడ ఉపాధి అవకాశాన్ని మిస్ చేసుకుంటాడు. అయితే.. సౌత్‌లో ఖాళీగా ఉందని ఏర్‌టాక్ మేనేజర్ హైదరాబాద్‌కు పంపిస్తాడు. అసలే బద్ధకస్తుడైన అరవింద్ తన తల్లితో పాటు.. మతిమరుపు చెల్లెలుతో కలసి హైదరాబాద్‌కు చేరుకుంటాడు. చెల్లెలు కోరిక మేరకు టివీ కొనేందుకు ఓ షాప్‌కు వెళ్లిన హీరో.. అక్కడ ఓ అమ్మాయి హ్యాండ్‌ బ్యాగ్‌ను దొంగలు కొట్టేయడాన్ని చూసి, వారితో వీరోచితంగా పోరాడి ఆ బ్యాగ్‌ను తిరిగి తీసిస్తాడు.