గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » సెంటిమెంట్‌ను పండించిన "విజయదశమి"
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
నటీనటులు : కళ్యాణ్ రామ్, వేదిక, సాయికుమార్, సుమన్, జయసుధ తదితరులు...
పతాకం : సాయి సర్వజిత్ మూవీస్
సంగీతం : శ్రీకాంత్ దేవా
మాటలు : పరుచూరి బ్రదర్స్
కథ : పేరరసు
కెమెరా : రాంప్రసాద్
నిర్మాత : ఈదర రంగారావు
దర్శకత్వం : వి. సముద్ర

తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ నటించిన "శివకాశి" సినిమాకి ఇది తెలుగురూపం అనేకన్నా జిరాక్స్ కాపీ అంటే సముచితంగా ఉంటుంది కళ్యాణ్‌రామ్ విజయదశమి. మొదటిభాగం పేలవంగా సాగినా.. రెండో భాగంలో కొంత కథ ఉండటంతో సినిమాను చూడగలరు.

ఇతర భాషలనుంచి మాతృభాషకు సినిమాను తర్జుమా చేయాలనుకుంటే వాటికి కాస్త కొత్త అందాలు జతచేర్చి తెరకెక్కించడం సినీరంగంలో జరిగే ప్రధాన విషయం. అయితే మరో భాష నుంచి తీసుకునే సినిమాను మక్కీకి మక్కీగా తీస్తే ఆ చిత్రం ఏవిధంగా ఉంటుందనడానికి విజయదశమి చక్కని ఉదాహరణ. ఇక కథ విషయానికొస్తే....

హైదరాబాదులోని ఒక కాలనీలో వెల్డర్‌గా పనిచేసే శివకాశి (కళ్యాణ్ రామ్) అన్యాయాన్ని సహించే తత్వం కాదు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా దాన్ని ఎదుర్కోడానికి గొడవ పడతాడు. ఇతనికున్న నలుగురి మిత్రబృందంలో బ్రహ్మానందం ఒకరు. అంగాంగ ప్రదర్శన చేస్తూ చిన్న స్కర్టు వేసుకుని వచ్చిన దేవి (వేదిక) ని ఒకడు ఏడిపిస్తుంటే అతడికి బుద్ధి చెప్పి, ఆడదాని పవిత్రత గురించి చిన్నపాటి లెక్చర్ ఇస్తాడు శివకాశి. విషయాన్ని చూసిన దేవి తండ్రి శివకాశి చెప్పిందాంట్లో తప్పేమీ లేదనడంతో శివకాశిపై ఎక్కడలేని ప్రేమ పెల్లుబుకుతుంది దేవి మనసులో. ఇంకేముంది చిన్న చిన్న గొడవలు, ఆ తరువాత ప్రేమలో పడటం అన్నీ జరిగిపోతాయి.

దేవి ప్రేమ విషయం తెలుసుకున్న ఆమె అన్నలు తమ తాహతుకు తగినవాడుకాదన్న కారణంతో శివకాశిని హెచ్చరించి, ఓసారి చంపించే ప్రయత్నాలు చేస్తారు. ఈ విషయాన్ని ఎలాగోలా బైటపడిన శివకాశి దేవికి, దేవి తండ్రికి చెబుతాడు. నీవు నా అల్లుడివి కావాలంటే నీకు ఎలాంటి అర్హతలు లేవు. నీవొక అనాథవి కదా... అని దేవి తండ్రి శివకాశిని ప్రశ్నించగా తాను అనాథను కాదంటూ అసలు విషయాన్ని చెబుతాడు శివకాశి.

జమీందారీ దంపతులు సుమన్, జయసుధ. వీరికి ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. వారిలో చిన్నవాడు శివకాశి, పెద్దవాడు దుర్గాప్రసాద్ (సాయికుమార్). చెడు అలవాట్లతో ఉన్న సాయికుమార్ చేసిన తప్పుకు తమ్ముడిని బాధ్యున్ని చేస్తూ... ఒక మహిళను సజీవదహనం చేసాడన్న నిందమోపుతాడు. దీంతో ఆవేశపడ్డ జమీందారు శివకాశిని ఇంట్లోంచి వెళ్లగొడుతాడు. ఆ రకంగా అందమైన కుటుంబం నుంచి తాను బయటపడి ఇలా బ్రతుకుతున్నానని చెబుతాడు శివకాశి దేవి తండ్రితో. ఇదంతా విన్న దేవి అన్నలు శివకాశిని హేళన చేస్తారు. నీ కుటుంబాన్ని తీసుకుని వస్తే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటాడు దేవి తండ్రి.