"తులసి" వనంలో గందరగోళం
శనివారం, 13 అక్టోబర్ 2007( 17:32 IST )
చిత్రం: తులసి.
నటీనటులు: వెంకటేష్, నయనతార, మాస్టర్ అతులిత్, శివాజీ, జయప్రకాష్ రెడ్డి, రవిబాబు, తనికెళ్ళభరణి, ఆశిష్ విద్యార్థి, విజయ్‌కుమార్ తదితరులు.
దర్శకత్వం: బోయపాటి శ్రీనివాస్
నిర్మాత: సురేష్‌బాబు.
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్
ముందుగానే వెంకటేష్ ప్రకటించినట్లుగా "తులసి"లో హై ఓల్టేజి హింస ఉంది. హైఓల్టేజ్‌కు గురయిన వ్యక్తి ఎగిరి అవతలిపడి చనిపోతాడు. సినిమాలో కూడా హీరో కొట్టిన దెబ్బలకు ఒక్కొక్కరు ఫోర్లు, సిక్సర్లుగా ఎగిరిపడుతుంటారు. మధ్యమధ్యలో రఘుబాబు సిక్సర్లు, ఫోర్లు అంటూ కామెంట్రీ చెబుతూ క్రికెట్‌ను గుర్తు చేస్తుంటాడు.
కథను సింగిల్ లైనులో చెప్పాలంటే... మంచి భర్తగా ఉండలేకపోయినా, మంచి తండ్రిగానైనా ఉండాలని తపించే వ్యక్తి కథే "తులసి".
ఇక కథలోకి వెళితే... ఓపెనింగ్ సీనే ఫ్యాషన్ డిజైనర్ వసుంధర (నయనతార) తన టీమ్‌తో ఫ్యాషన్ షోలో పాల్గొంటే, వారిని ఆటపట్టిస్తున్న రాహుల్‌దేవ్‌ను సడెన్‌గా హీరో చితకబాదడంతో సినిమా ప్రారంభమవుతుంది. హీరోయిజం చూపించినప్పటికీ వసుంధర అతన్ని అసహ్యించుకుంటుంది.
(హీరో ఎంట్రన్స్ ఇలా ఉంటుందనే ప్రేక్షకుడు ఊహించడు) కట్‌చేస్తే ఫ్లాష్‌బ్యాక్....పర్వతనేని తులసీరామ్ అలియాస్ తులసి (వెంకటేష్) వసుంధర (నయనతార) విదేశీ ప్రయాణం సందర్భంగా కలుసుకుని, అనాదిగా వస్తున్న సినిమాల్లోని మూస ఫార్ములా తరహాలో, కొద్దిరోజులు గడిచాక ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు.