గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "తులసి" వనంలో గందరగోళం
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
అసలు హీరో ఇంట్రడక్షన్ సీన్‌కు థియేటర్‌లో స్పందన నామమాత్రంగా ఉంది. సినిమా ఇంటర్వెల్ దాకా "జయంమనదేరా" ను గుర్తుకు తెస్తే, ఇంటర్వెల్ తర్వాత సినిమా చిరంజీవి "డాడీ" ని పోలి ఉంటుంది. ఒక సన్నివేశంలో తులసి కడుపులోకి రెండు, మూడు తూటాలు దూసుకుపోతాయి. ఇంకో సన్నివేశంలో తులసిని కత్తితో పొడిస్తే అవతలివైపు వస్తుంది. అయినా దాన్ని తీసుకుని ఏమీ కానట్లు ఎగురుతూ హీరోగారు వీరోచిత ఫైట్లు చేయడం వంటి సన్నివేశాలు సగటు ప్రేక్షకుని సహనానికి పరీక్షలాంటిదే.

ఇంతా చూస్తే తులసి అనేది అత్యంత పవిత్రమైన పేరు. అందుకే తులసీని మృత్యుంజయునిలా చూపించే ప్రయత్నం చేసారు. ఇక తులసి ఊర్లో వాళ్లనాన్న ఫ్యాక్షనిస్టు కాబట్టి అక్కడ హత్యలు జరిగినా పోలీసులు కనబడకపోవడం ఓకే. కానీ హీరో హైదరాబాద్, బెంగళూరు వచ్చినా ఎంతో మందిని నరకడం, హత్య చేయడం చేసినా పోలీసు వ్యవస్థ ఉనికిని దర్శక నిర్మాత విస్మరించడం మరీ విడ్డూరం.

"లక్ష్మీ"లో ఓ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నంచేసిన పాత్రను పోషించిన వెంకటేష్, తరువాత వచ్చిన హిట్ చిత్రం "ఆడవారి మాటకు అర్థాలే వేరులే" లో తన తండ్రి మరణానికి కారణమైన అమ్మాయిని దక్కించుకున్న యువకుడి పాత్రను పోషించాడు. ఇక "తులసి"లో చెడును చీల్చిచెండాడే మంచి తండ్రి పాత్రలో చక్కగా రాణించాడు. అయితే ఇందు కోసం ఇన్నేసి హత్యలు, నరుక్కోవడాలు అవసరమా? అని థియేటర్ నుంచి వెలుపలకు వచ్చే ప్రేక్షకులు మాట్లాడుకోవడం సినిమాలోని లోపాన్ని ఎత్తి చూపుతున్నది.

ఆర్టిస్టుల పరంగా హీరో తన పాత్రను ఈజీగా చేశాడు. నయనతార పర్వాలేదనిపించింది. శివాజీ, ఉత్తేజ్ కొన్ని సీన్లవరకే పరిమితం. అలీ, నర్సింగ్ యాదవ్ కామెడీ సాదాసీదాగా సాగుతుంది. తులసి కొడుకు హర్షగా నటించిన మాస్టర్ అతులిత్ తన మొదటి చిత్రంతోనే అందరిని ఇట్టే ఆకట్టుకుంటున్నాడు.

"అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా?" అని వసుంధర అంటే నువ్వు ఐదేళ్ళ నుంచి ఆడుతున్నవి అబద్ధాలే గదా. నాన్న విదేశాల్లో ఉన్నాడన్నావ్. అంటూ"... పిల్లాడు ఎదురు ప్రశ్నించే డైలాగ్స్‌తో పరుచూరి బ్రదర్స్ తమ కలానికి గల పదునును మరో సారి చాటుకున్నారు. చిత్ర ప్రథమార్థంలో హీరోహీరోయిన్లు కలిసి ఉండే సన్నివేశాల్లోని సంభాషణల్లో ద్వందార్థాలూ చోటు చేసుకోవడం కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పక తప్పదు.

పెండ్లి, పవిత్రత గురించి హీరో చెప్పిన అద్భుతమైన డైలాగ్‌లు సివిమా కథాగమనంలో ఏమాత్రం ఉపయోగపడకపోవడం గమనార్హం. దేవీశ్రీప్రసాద్ స్వరపరిచిన పాటలు వినాలనిపించేవిగా ఉన్నాయి. క్లబ్ డాన్సర్‌ పాత్రలో హీరోయిన్ శ్రియ ఓ పాటలో కన్పించినప్పటికీ సినిమాకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులు ఆదరిస్తారన్న ధీమాతో అడ్డూఅదుపులేకుండా సాగిన హింసకు చిరునామాగా నిలిచిన తులసిని సగటు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి మరి.