ప్రధాన పేజి   వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అందం లోపించిన 'అందమైన మనస్సులో...'
WD PhotoWD
నటీనటులు: రాజీవ్, సింధుమీనన్, అర్చనా గుప్త, లక్ష్మీపతి, సునీల్, బెనర్జీ, సన, అతిధి పాత్రలో ఆర్.నారాయణమూర్తి. బేనర్: ఎస్,వి.ప్రొడక్షన్స్, నిర్మాత: ఆర్.పి.పట్నాయక్, సంగీతం, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.పి.పట్నాయక్.

తేజ, ఆర్.పి. పట్నాయక్ కాంబినేషన్‌లో వచ్చిన 'జయం' సినిమాలో 'అందమైన మనసులో ఇంత అలజడెందుకో..' అనే పాట జనామోదాన్ని పొందింది. దాన్నే టైటిల్‌గా చేసుకుని కన్నడ నిర్మాత ఎస్.వి.బాబు నిర్మించే తొలి చిత్రానికి దర్శకత్వం వహించాడు. బాబు కన్నడ చిత్రాల్లో కూడా ఆర్.పి. మ్యూజిక్ అందించడంతో ఆయనకు కథ చెప్పి దర్శకుడిగా మారాడు. నువ్వు ప్రేమించిన వారిని పెండ్లిచేసుకోవడం గొప్పకాదు. నిన్ను ఆరాధించిన వారిని పొందడమే గొప్ప- అన్న పాయింట్‌తో ఈ చిత్రం రూపొందింది.

కథ...
గతాన్ని డైరీలో రాసుకుంటూ చెబుతున్నట్లుగా సినిమా ఆరంభమవుతుంది. తుషార్ (రాజీవ్ మోహన్) ఎం.ఎ. సోషియాలజీ యూనివర్శిటీలో చదువుతున్న రోజులనుంచి ప్రారంభమవుతుంది. అతనికి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ నడిపే ఇమ్మాన్యుయేల్ (సునీల్) స్నేహితుడుంటాడు. ఇతని అనుచరుడు లక్ష్మీపతి. ఇక యూనివర్శిటీలో చేరే తొలిరోజే సంధ్య (రమ్య) అనే సహాధ్యాయి తుషార్‌కు పరిచయమవుతుంది. కానీ ఆ పరిచయంతో రమ్య ప్రేమలో పడుతుంది. తుషార్‌కు మాత్రం ఉన్నా బయటకు వ్యక్తం చేయడు. సెలవుల్లో రమ్య ఇంటికి వెళుతుంది. వెళ్ళేటప్పుడు ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటారు.

అప్పుడు తను అనాధననీ, ఎవరి ప్రేమను పొందలేదని చెబుతాడు. ఊరి నుంచి వచ్చేలోగా గుర్తుగా ఆమెను ముద్దు అడుగుతాడు. ఆ సమయంలోనే తుషార్‌కు అంతకుముందే పరిచయమైన 8వ తరగతి చదువుతున్న బిందు అనే అమ్మాయి వచ్చి అమ్మ రమ్మంటుందని పిలుస్తుంది. ఇక ఇక్కడనుంచి బిందు గురించి చెప్పాలి. ఓసారి బిందుకు రోడ్ ఏక్సిడెంట్ జరిగితే తుషార్ రక్షించి సేమ్ గ్రూప్ రక్తదానం చేస్తాడు. దాంతో బిందు ఇంటిలో కుటుంబసభ్యుడు అవుతాడు. బిందు తల్లిదండ్రులు బెనర్జీ బెనర్జీ, సన. తుషార్ మంచి డాన్సర్ కూడా. బిందుకు డాన్సంటే ఇష్టం. దాంతో 8వ తరగతి నుంచి ఆమెకు డాన్స్ నేర్పుతాడు.

అలా పరిచయం బిందు మనస్సులో ప్రేమగా రూపాంతరం చెందుతుంది. మరోవైపు రమ్య ఊరునుంచి రాకపోగా తనకు పెళ్లయిందనే లెటర్ పంపిస్తుంది. దీంతో తుషార్ షాక్‌కు గురవుతాడు. ఇక ప్రేమపై విరక్తి చెంది.. ఎం.ఎ. పూర్తయినా కూడా అక్కడే ఉండి 'ఎ మదర్ లెస్ చైల్డ్ అండ్ చైల్ట్‌లెస్ మదర్' గురించి థీసెస్ రూపొందించి డాక్టరేట్ పొందుతాడు. ఈలోగా బిందు వయస్సుతోపాటు ప్రేమ పెరుగుతుంది. ఓ సందర్భంలో ఆ విషయాన్ని వ్యక్తం చేస్తే, నీ వయస్సేమిటి?. నా వయస్సేమిటి? అని గద్దిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి తను మొదట ప్రేమించిన రమ్య, తన భర్త వడ్డే నవీన్‌తో కలిసి తుషార్ ఉన్న ఊరికే వస్తుంది. ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది?, ఎవరింట్లో ఉంది?, ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిగిలిన సినిమా.
1 | 2  >>  
మరిన్ని
ప్రేమకోసం 'ఒంటరి'గా మారిన గోపీచంద్
జోథా-అక్బర్‌ల వెండితెర ప్రేమకు రాజపుత్రుల చెక్
మనస్సును కదిలించే "రాళ్ళు"
ప్రేమ త్యాగం ప్రధానాంశంగా వాన చిత్రం
ఫట్‌మనిపించిన ఒక్క మగాడు
అవినీతిపై పోరాటమే 'ఆపదమొక్కులవాడు'