ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్
Jhon apparao
FileFILE
తారాగణం... కృష్ణ భగవాన్, సిమ్రాన్, రుతిక, అలీ, జీనా, వేణుమాధవ్, రఘుబాబు, అపూర్వ, తిరుపతి ప్రకాష్ తదితరులు.
నిర్మాత, దర్శకత్వం... వెంకట్ కూచిపూడి

హాస్య నటుడిగా అందరినీ మెప్పిస్తున్న కృష్ణభగవాన్ జాన్ అప్పారావు 40 ప్లస్ ద్వారా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించాడు. అతని సరసన అందాల తార సిమ్రాన్ నటించడం మరో విశేషం నలభై ఏళ్లొచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించే వ్యక్తి కథే ఈ అప్పారావు 40 ప్లస్ చిత్రం. ఈ చిత్రంలో అప్పారావు పాత్రలో కృష్ణభగవాన్ నటించాడు. విహాహం పేరుతో వినోదాత్మకంగా తీయాలన్న దర్శకుని ఆలోచనకు సరిగ్గా సరిపోవనప్పటికీ, ఫర్వాలేదనిపిస్తోంది.

రైతుబజార్‌లో బాంబ్ బ్లాస్ట్ జరగడంతో అక్కడి ప్రజలు చనిపోయే సీన్‌తో చిత్రం ప్రారంభమవుతుంది. దీన్ని చూసి సీరియస్ మూవీ అని అందరూ భ్రమ పడతారు. ఇంకో వైపు అప్పారావు ఫ్యాషన్ డిజైనర్ అని తెలిపేలా అమ్మాయిల డ్రెస్‌లను కోడ్ చేస్తుంటాడు. ఇక కథలోకెళితే అప్పారావు అనబడే కృష్ణభగవాన్‌ తన చివరి చెల్లిలికి కూడా అధికంగా కట్నం ఇచ్చి పెళ్లి చేస్తాడు. దీనికి అందరూ అతనిని పొగుడుతారు.

ఇక నీ పెళ్లి సంగతి ఆలోచించు అన్నాయ్యా అని చెల్లెళ్లు అంటారు. అప్పారావు అసిస్టెంట్లు అయిన రాజేష్, తిరుపతి ప్రకాష్ అసిస్టెంట్లు. వీళ్లే కాకుండా రుద్రరాజు అలియాస్ దురదరాజు, మాణిక్యరావు అలియాస్ తరుణ్‌లు కూడా అప్పారావు స్నేహితులుగా ఉంటారు. వీరందరూ కలసి అప్పారావుకి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేసి విఫలమవుతారు.

తనకిక పెళ్లి కాదని విచారంగా సముద్రపు ఒడ్డులో కూర్చున్న అప్పారావు వద్దకు ఓ అపరిచిత వ్యక్తి వచ్చి తన జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి వస్తుందని దాంతో జీవితం మలుపు తిరుగుతుందని చెప్తాడు. అతను చెప్పినట్టుగానే ప్రవల్లిక (సిమ్రాన్) కనిపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అప్పారావుకు ఫోన్ చేసి డ్రెస్ డిజైన్ చేయమని చెప్తుంది.

ఆ డ్రెస్ చాలా బావుందని తన స్నేహితులకు బాగా నచ్చిందని చెబుతుంది. ఇద్దరమూ పార్టనర్లుగా ఉందామని లండన్ రావాలని అప్పారావును కోరుతుంది. దీనితో ప్రవల్లిక తనను ప్రేమిస్తోందని అప్పారావు భావిస్తాడు. అయితే బీబీసీ కరెస్పాండెంట్ అయిన ప్రవల్లిక ప్రఖ్యాతి గాంచిన తీవ్రవాది జాన్‌ను ఇంటర్వ్యూ తీసేందుకు లండన్ వెళ్తోంది. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలంటే పోలీసులకు తెలీకుండా దుబాయ్ వెళ్లే ఏర్పాట్లు చేయమని డిమాండ్ చేస్తాడు జాన్. అప్పారావు కూడా అచ్చం జాన్‌లా ఉండటంతో అతనిని తనతో పాటు తీసుకెళ్లింది.

తర్వాత ఏం జరిగింది ? అప్పారావు ఏం చేస్తాడు? జాన్ దుబాయ్ వెళ్లాడా ? అన్నది తెరపై చూడాల్సిందే. తొలి సీన్‌లోనే బాంబ్ బ్లాస్ట్‌‌తో ప్రారంభించినప్పటికీ, దాని గురించి రెండో ఆఫ్ వరకు బయటకు రాదు. మొదటి ఆఫ్‌లో అప్పారావు పెళ్లి ప్రయత్నాలే సాగుతాయి. దీనికి సంబంధించి వివిధ రకాల అమ్మాయిలతో మాట్లాడే సన్నివేశాలు అంతగా ప్రేక్షకులను ఆకర్షించేలా లేవు. దీనికి సంబంధించి అప్పారావు అసిస్టెంట్లు, ఫ్రెండ్స్ ఉపయోగించిన భాష అంతగా రుచించలేదు.

తొలుత ఈ చిత్రానికి ఓ నిర్మాత ముందుకు వచ్చినప్పటికీ, తర్వాత వైదొలగడంతో అన్నీ తానై వెంకట్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లేలను నిర్వహించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అంతగా బాలేకపోయినా, ఫర్వాలేదనిపిస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ అని అప్పారావును దర్శకుడు పరిచయం చేసిన తీరు అంతగా బాలేదు.
మరిన్ని
ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే "భద్రాద్రి"
సమాజానికి అద్దంపట్టే 'ఇదీ సంగతి'
అందం లోపించిన 'అందమైన మనస్సులో...'
ప్రేమకోసం 'ఒంటరి'గా మారిన గోపీచంద్
జోథా-అక్బర్‌ల వెండితెర ప్రేమకు రాజపుత్రుల చెక్
మనస్సును కదిలించే "రాళ్ళు"