ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
Naresh
WD PhotoWD
అల్లరి నరేష్, కృష్ణభగవాన్‌ హీరోలుగా సిరిమీడియా బేనర్‌పై శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్. ఇందులో హీరోయిన్లుగా రిదిమ, ఫర్జానా నటించారు. ఇతరపాత్రల్లో భరణి, కోవైసరళ, కోటశ్రీనివాసరావు, ధర్మవరపు, రఘుబాబు, వేణుమాధవ్ నటించారు.

ఈ చిత్రం చూస్తున్నంత సేపు ఇదివరకే అలవాటైన కామేడీ చిత్రాల తరహాలోనే అనిపించినా నటీనటుల నటనతో ఆలోటు కనిపించనీయదు. చిత్ర కథ గురించి చెప్పాలంటే నిశ్చితార్ధమైపోయిన ఇద్దరు అమ్మాయిలను హీరోలు ఎలా పెళ్లి చేసుకున్నారు, అనే పాయింట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది.

ఇదే పాయింట్ ముందు చిత్రాల్లో సీరియస్‌గా చెబితే ఆ విషయాన్ని ఈ చిత్రంలో కామెడీగా చెప్పారు. దొంగల కుటుంబమైన బొమ్మన రాజా (భరణి, రాణి (కోవైసరళ)లకు నరేష్, కృష్ణభగవాన్ ఇద్దరు కొడుకులు. దొంగతనాలే వృత్తిగా బతికే వీరు ఓ రోజు భరణి దొంగలించుకొచ్చిన పర్సులోని ఫోటోలోని హీరోయిన్లను చూచి వారిని పెళ్లాడాలనే నిర్ణయానికొస్తారు.

అందుకోసం భరణి, కోవైసరళను మార్వాడీ వేషంలో కోటశ్రీనివాసరావు ఇంటికి పంపిస్తారు. అయితే వారికి అప్పటికే వేరొకరితో నిశ్చితార్థమైందని తెలిసి భరణి, కోవైసరళ నీరసంగా తిరిగొస్తారు. అయితే నిశ్చితార్థమైనా మళ్లీ ప్రేమించవచ్చనే మన తెలుగు సినిమాల స్టోరీలను తల్లితండ్రులకు చెప్పి వారిని ప్రేమించడానికి నరేష్, కృష్ణభగవాన్ సిద్ధమైపోతారు.

1 | 2  >>  
మరిన్ని
ఐమాక్స్‌లో "స్పేస్ స్టేషన్"
సామాజిక సమస్యలపై 'జల్సా'
పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్
ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే "భద్రాద్రి"
సమాజానికి అద్దంపట్టే 'ఇదీ సంగతి'
అందం లోపించిన 'అందమైన మనస్సులో...'