కృష్ణభగవాన్, రఘుబాబు హీరోలుగా, రంభ హీరోయిన్‌గా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో శశిధర్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం దొంగసచ్చినోళ్లు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కొండవలస, వేణుమాధవ్, వినోద్‌కుమార్, అభినయశ్రీ, బాబిలోనియా తదితరులు నటించారు. ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రం విశ్లేషణ గురించి చెప్పాలంటే చిత్రం పేరులో మాదిరిగానే సినిమా మొత్తం చౌకబారు కామెడీతో సాగుతుంది. కథలో ఎలాంటి పట్టు లేకుండా కేవలం అడ్డదిడ్డమైన కామెడీతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎలా ఉంటోందో అలాంటి ఓ చిత్రానికి ఇది ఓ ఉదాహరణ.
కథా విశ్లేషణ కొస్తే తమ బేవార్స్ కార్యక్రమాలతో ఊరివాళ్ల చేత దొంగసచ్చినోళ్లుగా పేరుతెచ్చుకున్న ఇద్దరు చివరకు ఎలా మంచి పేరు సంపాధించారు అన్నదే ఈ చిత్రంలోని పాయింట్.
ఓ పల్లెటూర్లో ఉండే రాముడు (రఘుబాబు) కాముడు (కృష్ణభగవాన్)లనే ఇద్దరు సోదరులకు చిన్నప్పుడే తల్లితండ్రులు పోవడంతో తమ బాబాయ్, పిన్నిల దగ్గర పెరుగుతారు. వీరు నిత్యం ఊరిలో బలాదూర్ తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తుంటారు. దీంతో ఊరివారంతా వీరిని దొంగసచ్చినోళ్లని అంటుంటారు.
ఇలాంటి వీరికి ప్లాష్‌బ్యాక్‌లో ఓ అక్క ఉంటుంది. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి వినోద్‌కుమార్‌ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. ఆ తర్వాత చానాళ్లకు ఇండియాకు తిరిగొస్తుంది. ఎలాగైనా తనవాళ్లతో మళ్లీ కలవాలన్న కోరికతో తన ఒక్కగానొక్క కూతురు కావ్య (రంభ)ను తన తమ్ముళ్లలో ఒకరికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది.
|