ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కథనంలో వేగం తగ్గిన 'పరుగు'
Parugu
FileFILE
అల్లు అర్జున్, షీలా జంటగా 'బొమ్మరిల్లు' దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పరుగు'. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు. హిట్ కాంబినేషన్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదటి నుంచి ప్రేక్షకుల్లో ఓ రకమైన అంచనా ఏర్పడింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం పెట్టిన పరుగు సరిపోలేదని చెప్పవచ్చు.

చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచిన కూతుళ్లు తనమాట కాదని, ప్రేమ కోసం పరుగు పెడితే ఆ కన్నతండ్రి మనసు ఎలా బాధపడుతుందో అన్న పాయింట్ ఇతివృత్తంగా ఈ కథ రూపొందింది.

కథా విషయానికొస్తే ఓ పల్లెటూరి పెద్దయిన నీలకంఠం (ప్రకాష్‌రాజ్)కు ఇద్దరు కుమార్తెలు. అందులో పెద్దకుమార్తెకు పెళ్లి నిశ్చయించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె తను ప్రేమించిన అబ్బాయితో లేచి పోతుంది. దీంతో తన కుమార్తె లేచిపోయిన అబ్బాయి ఆచూకీ కోసం అతని స్నేహితులను తెచ్చి బంధిస్తాడు నీలకంఠం.

అలా నీలకంఠం బంధించిన వారిలో కృష్ణ (అల్లు అర్జున్) కూడా ఒకడు. నీలకంఠం చెరనుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఓసారి పారిపోయే కృష్ణ ఓ అమ్మాయిని చూచి అదే ధ్యాసలో మళ్లీ నీలకంఠం మనుషులకు పట్టుబడుతాడు. అయితే తాను ప్రేమించిన అమ్మాయి నీలకంఠం చిన్న కూతురనే విషయం కృష్ణ తర్వాత గ్రహిస్తాడు.

1 | 2  >>  
మరిన్ని
చౌకబారు కామెడీకి చిరునామా దొంగసచ్చినోళ్లు
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఐమాక్స్‌లో "స్పేస్ స్టేషన్"
సామాజిక సమస్యలపై 'జల్సా'
పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్
ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడే "భద్రాద్రి"