ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలగూరగంప కథతో సాగే 'కంత్రి'
kantri
WD PhotoWD
ఎన్టీఆర్, హన్సిక జంటగా వైజయంతి మూవీస్ పతాకంపై మోహర్‌రమేష్ దర్శకునిగా తెరకెక్కిన చిత్రం 'కంత్రి'. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా, ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో తనీషా, ప్రకాష్‌రాజ్, షిండే, ముఖేష్‌రుషి, మురళీశర్మ, ధర్మవరపు, జయప్రకాష్‌రెడ్డి, ఆహుతిప్రసాద్, బెనర్జీ, సునీల్, అలీ, అశిష్‌విద్యార్ధి, కృష్ణభగవాన్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు నటించారు.

ఈ చిత్రం గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రేక్షకునికి ఎలాంటి థ్రిల్లు కలిగించకుండా చిత్రం మొత్తం సాగిపోతుంది. కథలో పాత్రలు ఎక్కువై అసలు దర్శకుడు ఎం చెప్పాలనుకుంటున్నాడో తెలియని గందరగోళ పరిస్థితి చూసే ప్రేక్షకునికి కలగడం కాయం.

సినిమా కథ విషయానికొస్తే... ఓ ఊరిలో డబ్బున్న వ్యక్తి (ముఖేష్‌రుషి) కొడుకు, అతని కుటుంబం విదేశాలనుంచి తిరిగివచ్చి కోటిరూపాయల ఖర్చుతో ఊరిలో ఫ్యాక్టరీ పెట్టాలని భావిస్తుంది. అయితే ముఖేష్‌రుషి వద్ద పనివాడైన పోతురాజు (ప్రకాష్‌రాజ్) ఆ డబ్బుపై కన్నేస్తాడు. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తెస్తున్న సమయంలో ఆ డబ్బు కోసం ముఖేష్‌రుషి కొడుకు కుటుంబాన్ని కారుతో సహా తగలబెట్టేస్తాడు.

ఈ విషయం ముఖేష్‌రుషికి తెలిసిపోవడంతో తన భార్య, బిడ్డని సైతం వదలిపెట్టి పోతురాజు తన సహాయకుడైన ఆశిష్ విద్యార్ధితో కలిసి ఊరినుంచి పారిపోతాడు. ఇలా పారిపోయిన పోతురాజు పట్నం చేరుకుని దొంగనోట్ల వ్యాపారంతో వెయ్యికోట్లకు అధిపతి అవుతాడు. దాంతో తన మకాంని హాంకాంగ్ మార్చేసి అక్కడినుంచే తన కార్యకలాపాలు సాగిస్తుంటాడు.

అతని అనుచరుడైన అశిష్ విద్యార్ధి ఇక్కడున్న పోతురాజుకు సంబంధించిన దొంగనోట్ల వ్యాపారాన్ని చూసుకుంటుంటాడు. ఈ సమయంలో ఓసారి దొంగనోట్ల రవాణా సాగుతుండగా ప్రత్యర్ధి అయిన షాయాజీ షిండే అనుచరులు దాడి చేస్తారు. ఆసమయంలో అక్కడికి చేరుకునే క్రాంతి (ఎన్టీఆర్) దాడి చేసినవారిని కొట్టి ఆశిష్ విద్యార్ధి గ్యాంగ్‌లో చేరుతాడు.

గ్యాంగ్ వాళ్లు ఎన్టీఆర్‌ను కంత్రిగా పిలుస్తుంటారు. అయితే ఓసమయంలో తనుంటున్న అనాధాశ్రమంలో ఓ వ్యక్తి ఆపరేషన్ కోసం కంత్రి పదిలక్షలు కోరగా అశిష్ విద్యార్ధి ఇవ్వనంటాడు. దీంతో అశిష్ విద్యార్ధి నుంచి విడిపోయి షాయాజీషిండేతో కంత్రి చేతులు కలుపుతాడు. అలా షాయాజీషిండే ఇచ్చిన కోటిరూపాయల డబ్బుతో కంత్రి కొత్త గ్యాంగ్‌ని ఏర్పాటుచేసుకుంటాడు.

1 | 2  >>  
మరిన్ని
కథనంలో వేగం తగ్గిన 'పరుగు'
చౌకబారు కామెడీకి చిరునామా దొంగసచ్చినోళ్లు
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఐమాక్స్‌లో "స్పేస్ స్టేషన్"
సామాజిక సమస్యలపై 'జల్సా'
పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్