ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలగూరగంప కథతో సాగే 'కంత్రి'
దీంతో ఆశిష్ విద్యార్ధి గ్యాంగ్‌కు కంత్రి పక్కలో బల్లెంగా తయారవుతాడు. ఈ విషయాలన్నీ తెలిసిన పోతురాజు హాంకాంగ్ నుంచి ఇండియా చేరుకుంటాడు. ఇండియాకు చేరగానే కంత్రిని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈసమయంలో కంత్రిని పెంచిన అనాధాశ్రమం నిర్వాహకుడు కోటశ్రీనివాసరావు అక్కడకు చేరుకుని పోతురాజును గుర్తుపడుతాడు.

దాంతో కంత్రి నీ కొడుకే అంటూ పోతురాజుకు చెబుతాడు. దీంతో పోతురాజు, కంత్రిలు ఒకటవుతారు. కానీ ఇలా కలిసిన కొంతసేపటికే పోతురాజుకు, ఆశిష్ విద్యార్ధికి మధ్య గొడవలు వచ్చేలా చేస్తాడు కంత్రి. అయితే ఇలా ఎందుకు చేశాడు. మరి ఈమధ్యలో హీరోయిన్ హన్సికతో ఎలా ప్రేమాయణం సాగించాడు. వీళ్ల మధ్య మరో హీరోయిన్ తనీషా ఎందుకు తలదూర్చింది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ పూర్తిగా చెప్పాలంటే ఓ పట్టాన వీలుపడని ఈ కథకు స్క్రీన్‌ప్లేనే ముఖ్యమని చెప్పవచ్చు. అయితే ఈ విషయంలో దర్శకుడు పూర్తిగా తేలిపోయాడు. దీంతో సినిమా చూసే ప్రేక్షకునికి విసుగే కాదు విరక్తి కూడా కలుగుతుంది. గతంలో ఈ దర్శకుడు 'ఆంధ్రావాలా', 'ఒక్కడు' చిత్రాల్ని కన్నడంలో రీమేక్ చేసిన అనుభవం ఉంది. దాంతో ఈ దర్శకుడు చెప్పిన కత నచ్చి కంత్రి చిత్రంలో నటిస్తున్నట్టు ఎన్టీఆర్ చెప్పాడు.

కంత్రి చిత్రంలో కథ చూస్తే ఎన్టీఆర్‌కు ఇందులో ఏం నచ్చిందా అన్న అనుమానం రాక మానదు. కథలో ఎక్కడా ట్విస్టులు లేవు. అయినా కథని ఎందుకు సాగదీసాడో దర్శకునికే తెలియాలి. కథలో జరిగే కొన్ని విషయాలు అస్సలు అంతుపట్టవు. దొంగనోట్లు పబ్లిగ్గా రవాణా అవుతున్నా పోలీసులెందుకు పట్టించుకోరో అర్ధం కాదు.

ఇలా అడ్డదిడ్డందా సాగే కథలో కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్, హన్సిక జంట ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంది. అలాగే ఎన్టీఆర్ డాన్స్‌ కొత్తగా ఉండి అభిమానులకు మంచి కిక్‌నిస్తుంది. ఎన్టీఆర్ కంత్రి పాత్రలో బాగా చేశాడు. ఇంట్రడక్షన్ సీన్‌లో తాత ఎన్టీఆర్ గురించి, సైకిల్ గురించి గొప్పగా చెప్పారు. కామెడీ సైతం ఫర్వాలేదనిపించింది. మణిశర్మ సంగీతం బాగుంది.

అయితే యమదొంగ విజయం తర్వాత మరో మెగాహిట్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
<< 1 | 2 
మరిన్ని
కథనంలో వేగం తగ్గిన 'పరుగు'
చౌకబారు కామెడీకి చిరునామా దొంగసచ్చినోళ్లు
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఐమాక్స్‌లో "స్పేస్ స్టేషన్"
సామాజిక సమస్యలపై 'జల్సా'
పెళ్లి గొడవతో సాగే 40 ప్లస్