ప్రధాన పేజి > వినోదం > వెండితెర > సమీక్ష
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
'రక్తి'లోంచి 'భక్తి': అదే 'పాండురంగడు' సారాంశం  Search similar articles
Pandurangadu
FileWD
బాలకృష్ణ హీరోగా నేటితరం భక్తిరస చిత్రాల దర్శకుడైన కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పాండురంగడు'. అలనాడు ఎన్టీఆర్ హీరోగా వచ్చిన పాండురంగమహత్యం చిత్రాన్నే ప్రస్తుతం పాండురంగడుగా పునర్నిర్మించారు. స్నేహ, టబు, కె. విశ్వనాథ్, శివపార్వతి, ప్రసాద్‌బాబు, సునీల్, బాలయ్య, గుండు హనుమంతరావు తదితరులు ఈ చిత్రంలోని ఇతర తారాగణంగా నటించారు.

ఈ చిత్రానికి కథ, మాటలు- భారవి అందించగా కీరవాణి సంగీతాన్ని అందించారు. చిన్ననాటి నుంచి రసికుడిగా పెరిగిన వ్యక్తి భక్తి భావంలోకి మరలడమే ఈ పాండురంగడు కథాంశం.

కథా విషయానికొస్తే... పుండరీపురంలో నివశించే కె.విశ్వనాథ్‌కు అష్టమినాడు కుమారుడు పుడుతాడు. అతనికి రంగనాథుడు (బాలకృష్ణ) అనే పేరుపెడుతారు. చిన్ననాటి నుంచే అల్లరి చిల్లరిగా తిరిగే రంగనాథుడు యుక్తవయసు వచ్చేసరికి స్త్రీలోలుడుగా మారుతాడు. దాంతో రంగనాథునికి పెళ్లి చేయాలని తల్లితండ్రులు భావిస్తారు.

పెళ్లి అన్న ప్రస్తావన వచ్చేసరికి రంగనాథుడు ఇళ్లు విడిచి వెళ్లిపోతాడు. దీంతో ఆతని తండ్రి యాగం నిర్వహిస్తాడు. యాగ ఫలితంగా రంగనాథుడు తిరిగి ఇంటికి చేరుకుంటాడు. ఈ సమయంలో పక్క ఊరికి అమృత(టబు) అనే ఓ రంగసాని వస్తుంది. ఆమె రంగనాథునిపై మనసుపడుతుంది. దీంతో రంగనాథుడు ఆమె వశం అయిపోతాడు.

1 | 2  >>  
మరిన్ని
సిల్లీఫెలో 'బుజ్జిగాడు'
కలగూరగంప కథతో సాగే 'కంత్రి'
కథనంలో వేగం తగ్గిన 'పరుగు'
చౌకబారు కామెడీకి చిరునామా దొంగసచ్చినోళ్లు
అలవాటైన కామెడీ బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
ఐమాక్స్‌లో "స్పేస్ స్టేషన్"