గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » ఐక్యతే మహాబలమని చాటిన "విక్టరీ'
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్న పాయింట్‌పై విక్టరీ చిత్రం రూపొందింది. నితిన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ చిత్రానికి రవి సి కుమార్ దర్శకత్వం వహించారు. వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం చక్రి కెమేరా విజయ్ సి. కుమార్.

కథ:
దేవరాజ్ (అశుతోష్‌రాణా) ఒకరి భూమిని కబ్జా చేస్తాడు. మరోవైపు మరో గూండా పాండు (సుప్రీత్) మరొకతని లాండ్‌ను బెదిరించి తక్కువ మొత్తంతో లాక్కుంటాడు. ఆ వ్యక్తి దేవరాజ్‌ను ఆశ్రయిస్తాడు. తనపై ఎదురుతిరిగిన పాండు చేయి నరికి ఆ భూమిని తన పేరున మార్చుకుంటాడు దేవరాజ్.

కట్ చేస్తే విజయ్ (నితిన్) కండబలం ఉన్న బుద్ధిశాలి. ఐఏఎస్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు. అతనికి తండ్రి తనికెళ్ల భరణి, సోదరి ఉంటారు. తన కొడుక్కి పెళ్లి చేయాలనే ఉద్దేశ్యంతో కంప్యూటర్‌లో పెళ్లి సంబంధాలు చూస్తూ కుజదోషం ఉన్న అమ్మాయి కోసం వెతుకుతుంటాడు.

సరిగ్గా అలాంటి వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్న జానకి (మమతా మోహన్‌దాస్) ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉద్యోగినిగా పనిచేస్తుంటుంది. విజయ్ బయోడేటా తెలుసుకుని అతనికి తెలీకుండా జానకి ఆటపట్టిస్తుంది. అతని స్నేహితుడు శశాంక్ ఓ షాప్ పెట్టేందుకు లోన్ ఆఫీసరుగా వచ్చినప్పుడు విజయ్‌ను కలుసుకుంటుంది.

మరోవైపు శశాంక్ టీవీ యాంకర్ సింధు (సింధు తులానీ)ని ప్రేమిస్తుంటారు. ఇలా ఉండగా, అక్కడే ఓ కాలనీలో ఐదెకరాల్లో తనకున్న స్థలంలో ఇల్లు కట్టుకోవాలని తనికెళ్ల భరణి కలలు కంటుంటాడు. అది స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య ఇల్లులేని అభాగ్యులైన కొంత మందికి ఉచితంగా ఇచ్చింది.

దాన్ని కబ్జా చేయాలని దేవరాజ్ చూస్తాడు. దీనికోసం పోలీసులను, రాజకీయ నాయకులను, ప్రభుత్వాధికారులను లోబరుచుకుంటాడు దేవరాజ్. ఆ విధంగా ఆ స్థలాన్ని దేవరాజ్ తన స్వాధీనంలోకి తీసుకుంటాడు. అంతా నిరాశ్రయులవుతారు. కోర్టుకి వెళ్లినా న్యాయం జరుగదు.

దీంతో విజయ్ తన మైండ్ గేమ్‌తో దేవరాజ్ బండారం బయటపెట్టి ప్రజల అభిమానాలను చూరగొంటాడు. ఇందులో స్నేహితుల పాత్ర ఏమిటి..? వారంతా ఎలా ఒక్కటి కాగలిగారు..? ఏం జరిగింది...? అన్న విషయాన్ని చిత్రంలో చూస్తేనే బాగుంటుంది.

 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఐక్యతే మహాబలమని చాటిన "విక్టరీ'