సినిమా... "బ్రహ్మానందం డ్రామా కంపెనీ" తారాగణం... బ్రహ్మానందం, శివాజీ, రవికిరణ్, రఘు, కమలిని ముఖర్జీ, ధర్మవరపు, అలీ, జీవ, రాంజగన్, రఘుబాబు, రవిబాబు, సమీక్ష, రంగనాథ్, శివాజీ రాజా తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. శ్రీకాంత్, ఎడిటింగ్.. నాగిరెడ్డి, నిర్మాతలు.. పల్లికేశవరావు, కె. కిషోర్.
పాయింట్.. డ్రామా కంపెనీలో హీరోయిన్ జంప్ కావడంతో వారెన్ని పాట్లుపడ్డారనేదాన్ని చిత్రంగా మలిచారు. ఆల్‌రెడీ హిందీలో బాగా ఆడిన "భాగంభాగ్" తెలుగులో తీశారు.
కామెడీ చిత్రాల హవా నడుస్తున్న తరుణంలో బ్రహ్మానందం పేరుపెట్టుకుని పల్లికేశవరావు నిర్మించి ఈ చిత్రం నిరుత్సాహ పరించిందనే చెప్పాలి. పేరుకు మాత్రమే బ్రహ్మానందం ఉన్నా ఏ సన్నివేశంలోనూ అది కనబడలేదు. డ్రామా కంపెనీ అంటేనే చులకన భావం ఎందుకుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది.
ఇక కథలోకి వెళితే..
ఆనందం (బ్రహ్మానందం)కు ఓ డ్రామా కంపెనీ ఉంటుంది. ఆ ట్రూపులో వాసు (శివాజీ), శ్రీను (రవికృష్ణ) హీరోలుగా ఉంటారు. సోని (సమీక్ష) హీరోయిన్‌గా ఉంటుంది. పేరుకు మాత్రమే డ్రామా కంపెనీ అయినా చేసేవి మాత్రం డ్యాన్స్‌లు. హీరోలిద్దరూ హీరోయిన్ అంటే కామంగా చూసే బాపతు. వీరికి తగినట్లు ఆనంద తన ట్రూప్‌లో ఉన్న అమ్మాయిని సిమ్‌కార్డ్ (హేమ)ను అదే బాపతులో చూస్తుంటాడు. వీరంతా కలిసి రవీంద్ర భారతిలో ఓ ప్రోగ్రామ్ ఇస్తారు.
అవి చూసి ఈవెంట్ మేనేజర్ (ఏవీఎస్) వీరికి బ్యాంకాక్‌లో షో ఏర్పాటు అవకాశం కల్పిస్తాడు. తీరా విమానంలో బయలుదేరే టైమ్‌లో తాను హాంకాక్‌రానని జంప్ అంటూ రాసిన ఉత్తరం ఆనందానికి లభిస్తుంది. ఈ విషయం మేనేజర్‌కు చెప్పకుండా రెండు రోజుల్లో వస్తుందని ఆనందం మేనేజ్ చేస్తాడు. షో దగ్గరపడుతున్న సమయానికి ఇద్దరిలో ఎవరు హీరోయిన్ తెస్తే వారే హీరో అంటాడు ఆనందం. ఇక వారిద్దరూ హీరోయిన్ కోసం వేట మొదలు పెడతారు. వీరికి అక్కడి కారు డ్రైవర్ భల్లూ (అలీ) సహకరిస్తాడు.
హీరోయిన్‌కోసం పార్క్‌లో వెతుకుతుంటే "హెరాయిన్" కోసం వీరు వెతుకున్నారని స్మగ్లర్ టీం అయిన రవిబాబు, రాంగజన్‌లు సూట్‌కేసును వారి చేతిలో పెడతారు. ఈలోగా పోలీసు సైరన్ రావడంతో పలాయనమవుతారు. అది హెరాయిన్ అని తెలిసి పోలీసులకు అప్పగిస్తే బహుమతి వస్తుందనుకుంటే వారే కష్టాల్లో చిక్కుకుంటారు. హీరోయిన్ వేటలో శ్రీనుకు రోడ్డుమీద ఆత్మహత్య చేసుకునే అర్పిత (కమలిని ముఖర్జీ) కనబడుతుంది. ఆమెను ఎలాగో తీసుకువచ్చి ట్రూప్‌లో హీరోయిన్ చేస్తారు.
|