కానీ ఖాళీ దొరికితే ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది. ఓ సందర్భంలో అలానే చేస్తే ఆమెకు సైసైడ్ల్‌టెండెన్సీ అనే వ్యాధితో బాధపడుతుందని డాక్టర్ ధృవీకరిస్తాడు. సరిగ్గా అప్పుడే ఈమె తన భార్యని వ్యాపారవేత్త మహేంద్ర (రఘు) వచ్చి అర్పితను ఇంటికి తీసుకెళతాడు. అప్పటికే ఆమెపై ప్రేమను పెంచుకున్న శ్రీను, వాసులు మదనపడుతుంటారు.
ఆ రాత్రే తను కష్టాల్లో ఉన్నానని, వెంటనే రాకపోతే చనిపోతానని వారికి అర్పిత నుంచి ఫోన్ వస్తుంది. వారంత ఆమె ఇంటికి వెళ్ళగా ఒళ్ళంతా కాలిపోయి కన్పిస్తుంది. ఆ తర్వాత వారంతా షాక్‌కు గురవుతారు. కానీ పోలీసులు మాత్రం వీరిని వెంటాడుతుంటారు. మరోవైపు స్మగ్లర్ల ముఠా వీరిని వెంబడిస్తుంది. వీరంతా ఎందుకు వెంటాడుతుంటారు? ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ : హిందీ "భాగం భాగ్" రీమేక్ అయిన ఈ చిత్రంలో అందులో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఏ మాత్రం కన్పించలేదు. బ్రహ్మానందంతో సహా అందరి పాత్రలు కృతంగానే ఉన్నాయి. రవికృష్ణ బాడీ లాంగ్వేజ్‌తో పాటు హావభావాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. శివాజీ పాత్రమేరకే నటించినా కొన్ని సందర్భాల్లో ఎబ్బెట్టుగా ఉంది. కమలినీ ముఖర్జీ పర్వాలేదనిపించింది. ఈమె పేరు మొదటిభాగంలో అంకిత, రెండో భాగంలో అర్పిత అంటూ పిలుస్తుంటారు. ధర్మవరపు పాత్రకూడా కామెడీని పండించలేదు. స్మగ్లర్లుగా రవిబాబు, రాంజగన్ పాత్రలే కొద్దిగా హాస్యాన్ని పండిస్తాయి.
షూటింగ్ బ్యాంకాక్ అన్నప్పటికీ చాలా భాగం హైదరాబాద్‌లో వేసిన సెట్లోనే డాన్స్‌లు తీసినట్లు కన్పిస్తుంది. "ఎందుకో ఈ వేళ ఎప్పుడూలేనంత సందడి..." అనేపాట కాస్త బాగుంది. నీ ఇల్లు బంగారం కాను, ఆకాశంలో ఓ తార.. వంటి రీమిక్స్ పాటల్లో హీరోల స్టెప్‌లు కవర్ చేయడానికి కెమెరా తిప్పడంతో చిరాకు పుట్టిస్తుంది. మొత్తానికి డ్రామా కంపెనీ అంటేనే పిచ్చిగంతులు అనే అర్థం స్ఫురిస్తుంది. ఇంతకుముందు శ్రీరామచంద్రులు తీసిన దర్శకుడు శ్రీకాంత్‌కు హిందీ సినిమాను కూడా సరిగ్గా కాపీ చేయలేకపోయాడు.