పతాకం.. ఎన్టీఆర్ ఆర్ట్స్ తారాగణం.... కళ్యాణ్‌రామ్, ప్రియామణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, రాజీవ్ కనకాల, రఘుబాబు, చంద్రమోహన్, సీత తదితరులు సంగీతం.. మిక్కీ జెమేయర్, కథ.... గౌరీ శంకర్, నిర్మాత... నందమూరి దర్శకత్వం... హర్షవర్ధన్.
పాయింట్.... ప్రజల ఆరోగ్యాలపై వ్యాపారంచేసే వైద్యమాఫియాపై కవలలైన హరి, రామ్‌లు చేసిన పోరాటమే ఈ చిత్రం.
"హరేరామ్" వినోదభరితమే అయినప్పటికీ.. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఎత్తి చూపిస్తూ, వాటికి పరిష్కారాలను కూడా చెప్పే చిత్రాలు చాలా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తనదైన బాణీలో చూపించాలనే కళ్యాణ్ రామ్ ప్రయత్నించారనే చెప్పవచ్చును. అందుకు గతంలో బాలయ్యతో 'విజయేంద్రవర్మ' చిత్రాన్ని తీసిన దర్శకుడు స్వర్ణసుబ్బారావును ఎంచుకున్నారు.
ఈ చిత్రంలో తన అదృష్టాన్ని పరీక్షించదలచుకున్న "హర్షవర్ధన్"గా దర్శకుడు పేరు మార్చకున్నాడు. ప్రాథమికంగా వైద్య మాఫియా అంశాన్ని తీసుకుని సీరియస్‌గా సాగే కథలో మధ్య మధ్యలో స్పీడ్‌బ్రేకర్లా పాటలు అడ్డు తగులుంటాయి. "అతనొక్కడే"తో తనసత్తాను నిరూపించుకున్న "కళ్యాణ్‌రామ్" హరేరామ్‌తో కాస్త పరిపక్వత చెందాడు.
సమస్యకు పరిష్కరించే క్రమంలో దర్శకుడు వినోదంపై సరియైన దృష్టిసారించలేకపోయాడు. స్ర్కీన్‌ప్లేలో కాస్త గందరగోళం ఏర్పడి కథగమనంలో ట్విస్ట్‌లు ఎక్కువగా అనిపిస్తుంది.
ఇక కథా వివరాలకెళితే... తలలు అతుక్కుని పుట్టిన తమ ఇద్దరు పిల్లల్ని స్పెషలిస్టు డాక్టర్ నాయుడు (రంగనాథ్) వేరు చేసి సక్సెస్ సాధించినందుకు ఆనందపడతారు. చంద్రమోహన్, సీత దంపతులు. కానీ రామ్‌లో చిన్న మెదడు తగినంతగా ఎదగక మైండ్ ఆంబ్లీగేటా అనే వ్యాధితో బాధపడతాడనీ, చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ (రంగనాథ్) సూచిస్తాడు.
చెప్పినట్లుగా చిన్నతనం నుంచి రామ్ ప్రవర్తనలో చాలా మార్పు కనబడుతుంది. జింకను ఎప్పుడూ పులే వేటాడి చంపుతుందా? జింకే ఎందుకు చంపకూడదు? అనే ఆలోచిస్తుంటాడు. తన కంటే తెలివి తేటలుంటే సహించడు. అలా ఉన్న తన అన్ననే చంపాలనుకుంటాడు.
|