రామ్ ప్రవర్తనకు భయపడి సీత రామ్‌ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతుంది. హరికృష్ణ (కళ్యాణ్‌రామ్), చంద్రమోహన్ దగ్గర పెరుగుతాడు. అలాగే ఐపీఎస్ అధికారి అవుతాడు.
మరోవైపు, ఉత్తమ జర్నలిస్టు అవార్డు తీసుకోబోతున్న ఓ టీవీ రిపోర్టర్ (ప్రభాకర్) చనిపోతే దాన్ని యాక్సిడెంట్‌గా అందరూ భావిస్తారు. కానీ ఇది హత్యేఅని హరికృష్ణ (కళ్యాణ్‌రామ్) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ క్రమంలోనే ఉత్తమ డాక్టర్ అవార్డును తీసుకోబోతున్న రాజీవ్‌కనకాల హత్యకు గురవుతాడు.
వీళ్ళిద్దర్నీ చంపింది హరి అనే అనుమానంతో ఓసిఓసి బ్యాంక్‌లో లోన్ రికవరీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అంజలి (ప్రియమణి) తాను సీబీఐ ఆఫీసర్‌నని చెప్పి అరెస్టు చేయిస్తుంది. మొదటి భాగంలో ఎక్కువగా ప్రియామణి హరిని ఎలా లవ్ చేయాలో అనేదానిపై కాన్‌సన్‌ట్రేషన్ చేసి సడెన్‌గా సీబీఐ ఆఫీసర్ అంటూ దర్శకుడు ట్విస్ట్ ఇస్తాడు.
దీనితో ఇంటర్వెల్‌తో కథ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళుతుంది. ఇరు హత్యలకు హరి కారణం కాదంటూ రామ్ అంటూ వైద్య శాఖామంత్రి శివారెడ్డి (రెడ్డి అనే డైలాగ్‌లో తొలగించారు) కనిపెడతారు. మరోవైపు తన టీవీ 10 రిపోర్టర్‌ను చంపిందీ రామ్ అని అతని హతమార్చాలని అధినేత అశోక్ కుమార్ వేచిచూస్తుంటాడు.
అంజలి తను పొరపాటుపడ్డానని తెలుసుకుని రామ్ ఇంటిపై నిఘావేసి ఆమె తల్లిని ప్రశ్నిస్తుంది. రామ్ అమాయకుడంటూ అసలు విషయం చెబుతుంది. తనపై హత్యాచారం చేయబోతున్న ఓ గ్యాంగ్ నుంచి అమాయకుడైన రామ్, రిపోర్టర్ సింధుతులాని రక్షిస్తాడు. వింతరోగాల వ్యాధికి మందు కనిపెట్టిన రాజీవ్‌కనకాలను ఆమె ఇంటర్వ్యూ చేస్తున్న క్రమంలో, రోగాలు వారే సృష్టించి దానికి వారే మందు కనిపెట్టి ప్రజలతో వ్యాపారం చేయాలనకున్నట్లు గ్రహిస్తుంది.
ఈ విషయం తెలిసిన ఆమెను వైద్యమంత్రి శివారెడ్డి మనుషులు హత్యచేస్తారు. అప్పటికే తన ప్రేమను తెలపాలని గుడిలో ఎదురుచూస్తున్న రామ్‌కు విషయం తెలిసి వారిని ఎలా పగతీర్చుకున్నాడు? టీవీ అధినేతకు, మంత్రికి సంబంధం ఏమిటి? వారిద్దరూ కలిసి హరిని ఎందుకు చంపాలనుకున్నారు? కస్టడీలో ఉన్న హరి ఏమయ్యాడు? అన్నది మిగిలిన సినిమా.