గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » వైద్యమాఫియాపై "హరేరామ్"ల పోరాటం
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
చిత్రంలో మెలికలు...
హరేరామ్ చిత్రంలో మెలికలు బోలెడు. ట్విస్ట్‌లు కూడా అంతే. వాటి మధ్య వేసిన ముడుపులు విప్పే క్రమంలో కాస్త గందరగోళం. అయితే రామ్ (కళ్యాణ్‌రామ్) మునుపటి సినిమాల్లో పోలిస్తే ఆ పాత్రకు న్యాయం చేశాడు. వాచికం, అభినయం చక్కగా ఉంది. లంచగొండి నాయకుడిగా కోటశ్రీనివాసరావు కొట్టిన పిండిగా చేశాడు.

వెంకటేష్ నటించిన 'గణేష్' చిత్రం ఛాయలు కొద్దిగా కన్పిస్తాయి. టీవీ 10 ఛానల్‌లు అడ్డు పెట్టుకుని ఎలా ఎదగవచ్చునన్న అంశాన్ని అశోక్ కుమార్ పాత్రలో దర్శకుడు చూపించాడు. వింతరోగాల పేరుతో ప్రజల్ని ఏవిధంగా మోసం చేయవచ్చో మంత్రి పాత్రద్వారా కోట చూపించారు. ఎటువంటి రోగాలు వచ్చినా రాజకీయనాయకుల సృష్టే అన్నంతగా.. ఈ చిత్రం చూసిన ప్రేక్షకుడు ఫీలవుతాడు.

మంత్రి వెనుక పి.ఎ. పాత్ర అచ్చు వై.ఎస్. పక్కన సూరిపాత్ర (లక్ష్మీపతి) తెల్లటి జుట్టును పోలి ఉంటుంది. దీనికి సెన్సార్ అభ్యంతరం చెప్పింది. కథాగమనంలో తీయడానికి వీలులేక అలానే ఉంచేశారు.

ఇక హాస్యం సంగతి కొస్తే.. ఈ చిత్రంలో హాస్యం కోసం పెట్టిన బ్రహ్మానందం పాత్ర కథ సాగడానికి ఉపయోగపడుతుంది. అలీ, వేణుమాధవ్, రఘుబాబు పాత్రలున్నా ఆశించిన కామెడీ పండలేదు. మిక్కీ. జె. మేయర్ సంగీతం, కెమెరా పనితరం బాగానే ఉన్నాయి. ఒక రకమైన సైకో చిత్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి దర్శకుడు ప్రయత్నించి స్ర్కీన్‌ప్లే లోపంతో గాడి తప్పాడు. దీంతో మొదటి భాగం పట్టు సడలింది. పతాక సన్నివేశంలో మంత్రిని హతమార్చే సన్నివేశం ఆకట్టుకుంది.

డైలాగ్స్ పరంగా చూస్తే... స్వామీజీ, విజయ్‌లు ఇంకాస్త మెరుగులు దిద్దితే బాగుండేది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా కళ్యాణ్ రామ్ చేసిన ఈ ప్రయత్నం అభినందించదగినదే అయినా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.. మరి.