గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » తొలిప్రేమ తరహాలోనే ఉల్లాసంగా.. ఉత్సాహంగా..."
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
సినిమా.. "ఉల్లాసంగా.. ఉత్సాహంగా..."
తారాగణం.. యశోసాగర్, స్నేహఉల్లాల్, చంద్రమోహన్, బ్రహ్మానందం, ధర్మవరపు, సునీల్, సుధ, సుభాషిణి, సురేఖా వాణి తదితరులు,
నిర్మాతలు... సోము, రంగనాథ్,
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... కరుణాకరన్
పాటలు... అనంత్ శ్రీరామ్,
మాటలు... చింతపల్లి రమణ.

పాయింట్... చిన్నతనంలోని స్నేహితులు.. పెద్దాయ్యాక విడిపోయి, ప్రేమలో పడితే ఎలా ఉంటుందో తెలియజెప్పే కథాంశం.

ఇటువంటి కథలు యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. తెలియని వయస్సులోని స్నేహం ప్రేమగా మారడం వంటివి, "మనసంతా నువ్వే" వంటి ప్రేమకథా చిత్రాల ద్వారా విడుదలై హిట్టయిన సంగతి తెలిసిందే. ఆల్‌రెడీ దర్శకుడు "తొలిప్రేమ" సినిమాను తీసి హిట్ కొట్టాక, మళ్ళీ ఉల్లాసంగా... ఉత్సాహంగా.. పేరుతో ఈనాటి ట్రెండ్‌కు తగిన విధంగా రూపొందించి మార్చి తీసినా.. ఆ ఛాయలు కనబడటంతో ఫీల్ పోయింది.

ఇక కథలోకి వెళితే... ఓ పల్లెటూరిలో బాలాజీ (యశోసాగర్), ధనలక్ష్మీ (స్నేహా ఉల్లాల్) స్నేహితులుగా ఉంటారు. ధనలక్ష్మి ముఖంలో నవ్వుకోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండే తత్వం బాలాజీ. ఓ సందర్భంలో తన తండ్రితో పాటు బాలాజీ ఊరు విడిచి వెళ్ళిపోతాడు. అలా 15 సంవత్సరాలు గడచాక ఇద్దరూ పెద్దవాళ్ళవుతారు.

మరోవైపు ధనలక్ష్మి మనస్సులో బాలాజీ మరింతగా నాటుకుపోతాడు. ధనలక్ష్మి తల్లికి బాలాజీ అంటే పడదు. ఓ సందర్భంలో కాలేజీ సెలవులకు ధనలక్ష్మి తన బంధువుల ఇంటికి వస్తుంది. అక్కడ ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. అది ప్రేమగా మారుతుంది. ఆ వ్యక్తి ఈమెను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ ధనలక్ష్మి తను చిన్నతనంలోనే బాలాజీని ప్రేమించానని కథ చెబుతుంది.

ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ వ్యక్తి ప్రేమ ఏమైంది? ధనలక్ష్మి ఎవరిని ప్రేమించింది అన్నదే మిగిలిన కథ. నటనాపరంగా యశోసాగర్ చాలా నేర్చుకోవాల్సి ఉంది. బెంగళూరుకు చెందిన నిర్మాత కొడుకైన యశోసాగర్‌ను దర్శకుడు కాస్త ఇంట్రస్ట్ పెట్టి సినిమా తీశాడు. చాలా ఎమోషనల్‌లో బ్లాంక్ ఫేస్ కన్పిస్తుంది. ఇక కామెడీ ఆర్టిస్టులుగా సునీల్, ధర్మవరపు, వేణుమాధవ్ పర్వాలేదనిపించారు.

మొత్తానికి ఈ చిత్రం "తొలిప్రేమ" చిత్రం ఛాయలు కూడా కన్పిస్తాయి. టోటల్‌గా ఈ చిత్రం చక్కని ఫోటోగ్రఫీ సంగీతంతో ఆకట్టుకున్నా కథాగమనంలో కాస్తు పట్టు తప్పింది. చాలా నమ్మకంతో దిల్‌రాజు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసినా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష తొలిప్రేమ ఉల్లాసం ఉత్సాహం యశోసాగర్ స్నేహఉల్లాల్ చంద్రమోహన్ బ్రహ్మానందం