గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » హృదయాన్ని స్పృశించిన 'కథానాయకుడు'
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
rajanikanth
FileFILE
నటీనటులు... రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, ఎం.ఎస్.నారాయణ, మమతా మోహన్‌దాస్ తదితరులు.

కథ... శ్రీనివాస్, పాటలు... వేటూరి, రామజోగయ్య శాస్త్రి, సంగీతం.... జి.వి.ప్రకాష్, మూల కథ: కథ పరంయుంబోల్ (మలయాళం)

పాయింట్... మంచి మిత్రుడు దొరకడం దేవుడిచ్చిన వరం. -- బెర్నార్డ్ షా అన్న మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని అల్లిన కథ.

పాత మిత్రుడు.. మధ్య మిత్రుడు... అధమ మిత్రుడు... అని మిత్రుడిలో మూడు రకాలని పెద్దలు వర్ణించారు. అంగ్లంలో బెస్ట్‌ఫ్రెండ్, పెట్‌ఫ్రెండ్, నెట్‌ఫ్రెండ్ అంటుంటారు. ఈ స్నేహం గురించి రకరకాల కథలతో సినిమాలు వచ్చాయి. అవన్నీ ఒక తరహా అయితే, "కథానాయకుడు" ఒక్కటే ఒక తరహా. కొంతమంది వీడు తన ప్రాణ మిత్రుడు (బెస్ట్ ఫ్రెండ్) అని పరిచయం చేస్తుంటారు. కాని అసలు ప్రాణమిత్రుడు ఎలా ఉంటాడో ఈ చిత్రం ద్వారా రజనీ కాంత్ తెలియజేశారు.

తల్లిదండ్రుల తర్వాత గురువు అన్నారు. కానీ మిత్రుడు అని పెద్దలు ఎందుకు పెట్టలేదో తెలియదు. నా దృష్టిలో గురువు తర్వాత స్థానం మిత్రుడిది. ఆ తర్వాతే దైవం. అంటూ సుపర్‌స్టార్ రజనీకాంత్ క్లైమాక్స్‌లో ఓ స్కూల్ వార్షికోత్సవంలో అంటాడు. చిత్ర కథకు అదే మూలం. లోగడ ఎన్.టి.అర్ తీసినా, ఆ తర్వాత బాలకృష్ణ తీసినా ఆ "కాథానాయకుడు" కథలు వేరు. రజనీకాంత్ నటించిన ఈ "కథనాయకుడు" పాయింట్ వేరు.

వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్న రజనీకి ఈ చిత్రం గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. తాను ప్రేమించిన శ్రీదేవి (మీనా)ని తీసుకుని వేరే ఊరిలో బతుకుదెరువు కోసం కులవృత్తి అయిన క్షౌరవృత్తిని చేస్తుంటాడు. సిరిసిల్ల ఆ ఊరిపేరు. ఊరుమారుతున్నట్లుగా తన షాపును మార్చాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యాలయంకు వెళ్ళి తనకు లోనుకావాలని అర్జీపెట్టుకుంటాడు. అర్జీలో అన్నీ బాగానే రాసినా... తాను లంచం తీసుకోను ఇవ్వను. లోను మొత్తం కావాలి అన్న రాతలకు తాసీల్దార్‌కు కోపం వచ్చి గెంట్టేస్తాడు.

ఇక ఆ ఊరి పెద్ద. వడ్డీ వ్యాపారి ధర్మరాజు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం) దగ్గర కూడా అప్పు పుట్టక తన వద్ద ఉన్న ఓ చెక్క కుర్చీ... మాసి పోయిన అద్దం... పాతకాలపు కత్తెర, దువ్వెనలతో కూడిన చెక్కలషాపుతోనే జీవితాన్ని వెళ్ళదీస్తుంటాడు. బాలకృష్ణ దగ్గరే పని నేర్చుకున్న కాంతారావు (సునీల్) మార్పులకనుగుణంగా మోడ్రన్ షాపు పెట్టి బలవంతంగా జనాలకు లాక్కొచ్చి కటింగులు చేయిస్తుంటాడు. అసలే ఆత్మభిమానం, బెరుకుతనం ఉన్నబాలు... చేసేది లేక ... తన కటింగ్‌లో రిబేటు ప్రకటించుకుంటాడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పాత మిత్రుడు.. మధ్య మిత్రుడు... అధమ మిత్రుడు... అని మిత్రుడిలో మూడు