గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » హృదయాన్ని స్పృశించిన 'కథానాయకుడు'
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
FileFILE
బాలకృష్ణ పాత్రపైనే కథ అంతా నడుస్తుంది. మూడవ రీల్‌లోనే రజనీ కనిపిస్తారు. ఆయన వచ్చే సాంగ్‌లోనే ఎంజీఆర్, ఇతర కథానాయకులు కనిపిస్తారు. మమతా మోహన్‌దాస్ క్లైమాక్స్‌లో ఓ పాటకు అసిస్టెంట్ డైరక్టర్‌లా పి.వాసు పక్కన కూర్చుంటుంది. ఇక పాటల పరంగా చెప్పుకునే విధంగా లేవు. శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ పర్యవేక్షణ సంభాషణల్లో బాగానే ఉన్నా పాటల్లో డొల్లతనం కనబడింది. జివి.ప్రకాష్ నేపథ్య సంగీతం వాయిద్యహోరుతో సాహిత్యం మరుగున పడింది.

కాస్త ఆటవిడుపుగా రజనీ, నయనతార డ్యూయెట్ ‌సాంగ్ ఆకట్టుకుంది. హాస్యం పరంగా కటింగ్ కాంతారావుగా సునీల్ నవ్విస్తాడు. ధర్మవరపు, బ్రహ్మానందం పాత్రలు ఫర్వాలేదు. రజనీ పది గెట‌ప్‌లలో మొదటి పాటలో రకరకాల సినిమాల క్లిప్పింగ్స్ చూపిస్తారు. దర్శకత్వంలో పి.వాసు ఏమాత్రం పట్టుసడలకుండా నెట్టుకొచ్చి, క్లైమాక్స్‌లో అందరికళ్లు చమరుస్తాడు.

సినిమాకు క్లైమాక్స్ కీలకం. నేను అనుకున్నది ఏదీ జరగలేదు. జరిగిందంతా జరగాలనుంది జరిగింది. ఇవన్నీ వేదాంత ధోరణతిలో ఉన్నా.. సందర్భానుసారంగా రజనీ మాటలు ఆకట్టుకున్నాయి. ఉపాధ్యాయుడు అనే వాడు నిలుచొనే పాఠాలు చెప్పి అక్కడే నిల్చుని ఉంటాడు. కానీ, మనల్ని ఎంతో ఎత్తు ఎదిగేలా చేస్తారు. స్కూల్‌ చదివే రోజుల్లో నాకూ ఓ స్నేహితుడుండేవాడు. అంటూ.. చినిగిన బట్టలు, వర్షం వస్తే ఆకులు పెట్టుకుని స్కూల్‌కు వెళ్లిన రోజులు.. తలచుకుంటూ తను తినకుండా నాకు పెట్టిన రోజులు.. చెబుతూ.. ఒక్కసారి రజనీ కన్నీళ్ళ పర్యంతమవుతాయి.

అప్పటి వరకు సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆ పాత్రలో మమేకం అవుతారు. ఇదంతా బాలకృష్ణ గురించి చెపుతున్నారని ఊరంతా అనుకుంటూ... వారు కళ్లు చెమర్చుతారు. అప్పట్లో కురుక్షేత్రం నాటకంలో నటిస్తే.. నీ నటన చూసికాదురా. నీ శైలిని చూసి అందరూ చప్పట్లు కొట్టారు. నువ్వు మద్రాసుకు వెళ్లిపోయి గొప్పనటుడువి కావాలి.. అంటూ రైలు ఎక్కించాడు. ఇపుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో.. అంటూ ఒక్క క్షణం ఆగి.. రజనీ మిగిలిన ఉపన్యాసం పూర్తి చేస్తాడు.

బాలకృష్ణ ఇంటికి వచ్చిన తనపై ప్రేమ ఇంత ఉందా? అంటూ సంతోషపడుతుండాడు. కట్ చేస్తే.. రజనీ.. బాలకృష్ణ ఇంటికి రావడం... ఆప్యాయంగా కలుసుకోవడం.. కుటుంబాన్ని తన వెంటే తీసుకెళ్ళడంతో ముగుస్తుంది. ఇందులో జగపతిబాబు తన పాత్రకు జీవం పోశారు. ప్రాణమిత్రుడితో మాట్లాడాలనే ఆదుర్తాలో బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఇక ఆర్.ఎస్.పాత్ర ద్వారా సినిమా వాళ్ళు ఎలాంటి వారో కూడా దర్శకుడు చెప్పాడు. రజనీ, ఆర్.ఎస్.పాత్రల సంవాదం పలు ప్రశ్నలకు సమాధానం ఉంది. మీరెప్పుడూ మనశ్శాంతి కోసం హిమాలయాలు, ఆశ్రమాలు చుట్టూ తిరుగుతుంటారు.

అంటే మీరేం అనుకుంటున్నారు. ఇక్కడ మనశ్శాంతి దొరకదా. మేం ఎలా కనిపిస్తున్నాం. అనే ప్రశ్నలకు రజనీ సమాధానం బాగుంది. అదే విధంగా రాజకీయాల్లోకి కాసేపు వస్తానంటావు. కాసేపు రానంటావు. అసలు ఏ విషయమో సరిగ్గా చెప్పవు. ఇక్కడే ఎంతోమంది మీ కోసం ఎదురుచూస్తుంటారు. అసలు మీ దృష్టిలో ప్రజలు ఎలా కనిపిస్తున్నారు.. అంటూ వేసిన ప్రశ్నలకు రజనీ వివరణ సరైందిగానే అనిపిస్తుంది. మొత్తంగా చివరి 20 నిమిషాల ఎపిసోడ్ బాగానే ఆకట్టుకుంది.