గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "బలాదూర్"కి బాధ్యతల కంటే బాదుడే ఎక్కువ..!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
నటీనటులు... రవితేజ, అనుష్క, కృష్ణ, చంద్రమోహన్, బ్రహ్మానందం, సునీల్, స్వర్గీయ మల్లికార్జునరావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఎల్బీ శ్రీరామ్ తదితరులు.
సంగీతం... ఎ. రాధాకృష్ణ,
నిర్మాత... డి. సురేష్ బాబు,
దర్శకత్వం... ఉదయ్‌శంకర్

పాయింట్... అనేక చిత్రాల్లో వచ్చిన తరహా కథే అయినా... కొత్తదనం లేక పాతపచ్చడిలా తయారైంది. బాధ్యతలు లేకుండా బలాదూర్‌గా తిరిగేవాడు బాధ్యతగా ఇంటిని ఎలా చక్కదిద్దాడనేదే పాయింట్.

సినిమాకు వినోదం కోసమే వస్తారనేది ప్రస్తుతం సినీ చరిత్ర అయితే... దానితో పాటు కుటుంబ సంబంధాల సెంటిమెంట్‌నూ కూడా చూస్తారనేది కొందరి నమ్మకం. నమ్మకం మంచిదే దాన్ని చెప్పే విధానం సూటిగానూ, ట్విస్ట్‌లు గొలిపేదిగా, కొత్తదనంగానూ ఉంటేనే చూస్తారనేది మర్చిరోకూడదు. చిరంజీవి "విజేత" చేసినా హృదయాన్ని హత్తుకునే సెంటిమెంట్ ఉంది కాబట్టి విజేతగా నిలిచింది.

ఎన్.టి.ఆర్. "స్టూడెంట్ నెంబర్ 1"లో తండ్రికీ తెలీయకుండా కొడుకు ఇంటిని చక్కదిద్దినా చక్కని సెంటిమెంటు పండింది. అదే ప్రయత్నంలో కొత్త వినోదం ఇవ్వబోయి పాతచింతకాయ పచ్చడిని చూపించారు. దర్శకుడు ఉదయ్‌శంకర్. "కలిసుందాంరా..!" వంటి సక్సెస్ చేసినా ఉదయ్‌శంకర్ ఆ మధ్యలో "ప్రేమతో" చేసి ఫెయిల్ అయ్యారు.

మళ్శీ అదే బేనర్‌లో "బలాదూర్" (వీడికి బాధ్యతలెక్కువ) పేరుతో ముందుకు వచ్చాడు. రవితేజ బాడీలాంగ్వేజ్ సరిపడా కథే అయినా కథాగమనంలో సాగదీతలు, తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోవడంతో ట్విస్ట్ పోయింది. లాజిక్కులకు అందని సన్నివేశాలూ లేకపోలేదు.

ఇక కథసంగతికొస్తే... ఉమ్మడి కుటుంబంలోచంటి (రవితేజ) ఎలాంటి బాధ్యతలు లేకుండా బలాదూర్‌గా తిరుగుతుంటాడు. ఇతనికి తండ్రి పురుషోత్తం (చంద్రమోహన్) కంటే పెద్దనాన్న రామకృష్ణ (కృష్ణ) అంటే వల్లమాలిన అభిమానం. చంటిచేసిన పనులన్నింటినీ రామకృష్ణ వెనుకేసుకువస్తుంటాడు. ఓ సందర్భంలో వాల్లింటికి భానుమతి (అనుష్క) చదువుకోవడానికి వచ్చి చంటి ప్రేమలో పడుతుంది.

ఇదిలా ఉండగా, రామకృష్ణ కుమార్తె పెండ్లి చంటి వల్లే పెటాకులవుతుంది. దాంతో తనకొడుకుని కూడా చూడకుండా పురుషోత్తం ఇంటి నుంచి గెంటేస్తాడు. ఈలోగా చంటి ఇంటిలో రకరకాల మార్పులు చోటుచేసుకుంటాయి. తండ్రి చనిపోవడం, పెద్దనాన్న పరువులు ప్రతిష్టలు మంటగలవడం సంభవిస్తాయి. వాటినన్నింటినీ బయటనుంచే చంటి ఎలా పరిష్కరించాడు? అన్నది మిగిలిన సినిమా.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష రవితేజ, అనుష్క కృష్ణ చంద్రమోహన్ బ్రహ్మానందం సునీల్ స్వర్గీయ మల్లికార్జునరావు