గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » "బలాదూర్"కి బాధ్యతల కంటే బాదుడే ఎక్కువ..!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
WD
"బలాదూర్"లో కుటుంబ పెద్ద రామకృష్ణకు, ఎప్పుడో అతని దగ్గర పనిచేసి చెడ్డవాడిగా మారిన ప్రదీప్ రావత్ మధ్య కొనసాగే పగ, ప్రతీకారమే సినిమా. రవితేజ చలాకీగా తన శైలిలో మెప్పించాడు. తన వదినపై అసభ్యంగా ప్రవర్తించినందుకు అవతలివాడ్ని ఆసుపత్రి పాల్జేస్తాడు.

అతనెవరేనేది వదినమ్మ చెప్పదు. అయినా చంటి వెంటనే ఎలా తెలుసుకున్నాడన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. క్లైమాక్స్‌లో విలన్ ప్రదీప్ రావత్ పొడిచిన కత్తిపోట్లకు చంటి బతికే ఛాన్సేలేదు. అటువంటిది తన పెద్దనాన్న రామకృష్ణ పిలుపు వినగానే ఎగిరి ఫైటింగ్‌లు చేస్తుంటాడు. చివర్లో చంటి మంచివాడని, తనకొడుకులే చెడ్డవారని రామకృష్ణ తెలుసుకుంటాడు.

ఆ టైమ్‌లో చంటి కత్తిపోట్లకు గురై పెట్రోల్‌తో కాల్చడానికి విలన్లు సిద్ధంగా ఉంటారు. ఇంటిలో ఉన్న రామకృష్ణ సడెన్‌గా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇలా లాజిక్కు దొరకని పాతకాలపు ట్రిక్కులు చాలానే ఉన్నాయి. చిక్కుముడులు పెద్దగా లేకపోయినా కథ, కథనం కొన్నిసార్లు ఇబ్బంది కల్గిస్తుంది. ప్రథమార్థంలో పోలిస్తే ద్వితీయార్థంలో బాదుడెక్కువగా ఉంది. రొటీన్ చిత్రాల ఫార్ములాలో పాటలు, ఫైట్లు మినహా కొత్తదనమంటూ ఏమీ లేదు.

ఇక బ్రహ్మానందం మెకానిక్ షెడ్ ఓనర్‌గా పనిచేశాడు. రిపేర్ చేసిన బండిని ప్రతీసారి సెంటిమెంట్‌తో కొబ్బరికాయ కొట్టి డెలీవరీ చేస్తుంటాడు. ఒకటి రెండు సీన్స్ వరకు పర్వాలేదు గానీ, నాలుగైదు సీన్లు పెట్టేసరికి ఎబ్బెట్టు కలిగిస్తుంది. సునీల్ పాత్ర రోటీన్‌గా హీరో స్నేహితుడు, కాస్త నవ్విస్తాడు.

ఇక అనుష్క పాత్ర కథ హీరోకు లవ్‌ట్రాక్ ఉండాలి కనుక పెట్టినట్లుంది. మాట్లాడితే తాను 13 ఏళ్ళకే పెద్దమనిషయ్యానని... (సెన్సార్ కట్) చెబుతుంది. పెద్ద ప్రాధాన్యత లేదు. ఆమె హీరోకు చేసిన సాయంకూడా పెద్దగా ఉండదు. ఇద్దరూ కలుసుకుంటే పాటలు పాడుకోవడమే. అదే విలన్లు కనిపిస్తే బాదుడే బాదుడు. దీంతో వీడి బాదుడెక్కువయిందిరా అనిపిస్తుంది.

ఓ సందర్భంలో పిల్లలు చంటిని ఓ కథ చెప్పమని అడుగుతారు. ఒకరాజు ఏడుగురు కొడుకులంటూ చెప్పగానే... చాల్లే...తాత చెప్పే కథలే నువ్వూ చెబుతున్నావ్... నువ్వు కూడా జనరేషన్ గ్యాప్ వాడివే.. అంటూ.. పిల్లవాడు... అర్థరాత్రి... చీకటీ... తెల్లచీర అంటూ... థ్రిల్ కలిగించే కథ చెబుతాడు. పిల్లలకైనా, పెద్దలకైనా థ్రిల్ కల్గించే సన్నివేశాలుంటేనే సినిమా చూస్తారనేది దర్శకుడికి తెలిసినా... అది ఎందుకు మిస్ అయ్యాడనేది ప్రశ్నార్థకమే...!