గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » సమీక్ష » పాత, కొత్త చిత్రాల అనుకరణగా ఆదివిష్ణు!
సమీక్ష
Feedback Print Bookmark and Share
 
సినిమా... ఆదివిష్ణు,
నటీనటులు... దాసరి అరుణ్‌కుమార్, స్నేహ, సుమన్, కోటశ్రీనివాసరావు, సునీల్, ప్రదీప్ రావత్, అలీ, వేణుమాధవ్, ప్రేమ, ఐశ్వర్య తదితరులు,
కథ, స్క్రీన్‌ప్లే... దాసరి నారాయణరావు,
నిర్మాత... కె. రామకృష్ణ ప్రసాద్,
దర్శకత్వం... భరత్ పారేపల్లి

WD
విషయం... సాఫ్ట్‌వేర్ రంగాన్ని కుదిపేస్తున్న వైరస్‌కు యాంటీవైరస్‌ను కనిపెట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదివిష్ణు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ లాంటి టెర్రరిస్టులకు ఎటువంటి మందు కనిపెట్టాడన్నదే పాయింట్.

ఇటీవల హైదరాబాద్‌లోని లుంబీనీ పార్క్ గోగుల్ ఛాట్‌లో జరిగిన టెర్రరిస్టు బాంబ్ బ్లాస్ట్‌ల నేపథ్యంలో అల్లిన కథ. ఇండస్ట్రీ గురువుగా భావించే దాసరినారాయణరావు కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చిన ఆదివిష్ణును చూస్తే... ఆయన అనుభవం ఏమైందనేసందేహం కలుగుతుంది. అతుకుల బొంతగా పాత, కొత్త చిత్రాల మాలగా కన్పిస్తోంది.

ఇక కథలోకి వెళితే... రిటైర్డ్ ఉపాధ్యాయుడైన కోటశ్రీనివాసరావు కొడుకు ఆదివిష్ణు (దాసరి అరుణ్‌కుమార్). తను కనిపెట్టిన ఓ యాంటీ వైరస్‌ను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ మెచ్చి అమెరికాలో ఆఫర్ ఇస్తుంది. అందుకు పాస్‌పోర్ట్ కావాలి. దానికోసం మినిస్టర్ సుమన్‌ను ఆదివిష్ణు ఆశ్రయిస్తాడు.

తన రాజకీయ గురువు బాలయ్యను మోసగించి మంత్రి అయిన సుమన్ ఓ దశలో గురువునే చంపేస్తాడు. సుమన్ చెడుపనులకు అండగా ఉంటూ కాపాడే జంట ప్రదీప్ రావత్, ఐశ్వర్యలు... బాలయ్యను చంపుతుండగా అంజలి (స్నేహ) ఫోన్‌‌లో ఫోటో తీసేస్తుంది. ఆ విషయం తెలిసి ఆమెను చంపాలని ప్రదీప్ రావత్ గ్యాంగ్ వెంటాడుతుంది.

అనుకోని సంఘటనలో... ఆదివిష్ణు సహాయం అడగడం, ఆయన రౌడీలను చితకబాదడం జరుగుతుంది. దీంతో ఆ గ్యాంగ్ ఆదివిష్ణుపై పగపెంచుకుంటారు. మరోవైపు అమెరికాకు వెళ్ళే రోజు ఆదివిష్ణుకు రానే వస్తుంది. కానీ అదే రోజు సిటీలో రెండు చోట్లు బాంబ్ బ్లాస్ట్‌లు సంభవించడంతో అక్కడివారిని చూసిన ఊహాచిత్రంగా ఆదివిష్ణు ఫోటో తీసుకువచ్చి ఎ.సి.సి జీవా ఆదివిష్ణును అరెస్ట్ చేస్తాడు. తన కొడుకు నిర్దోషి అని కోట శ్రీనివాసరావు మంత్రిని ఆశ్రయిస్తాడు.
 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర సమీక్ష ఆదివిష్ణు దాసరి అరుణ్‌కుమార్ స్నేహ సుమన్, కోటశ్రీనివాసరావు, సునీల్, ప్రదీప్ రావత్, అలీ